Surya Gochar 2022: వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యుడిని సోల్ ఫ్యాక్టర్ ప్లానెట్ అని కూడా అంటారు. మీ జాతకంలో మెుదటి మరియు పదో ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. సూర్యుడి అనుగ్రహం లేకుంటే రాజకీయాల్లో ఎప్పటికీ ఉన్నత స్థానం లభించదు. నవంబర్ 16న సూర్యుడు వృశ్చికరాశిలో (Sun transit in Scorpio 2022) ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది. అయితే 4 రాశుల రాశుల వారికి ఈ సంచారం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఆ 4 రాశుల గురించి తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు వరం
మిధునరాశి (Gemini): సూర్యభగవానుడి సంచారం వల్ల మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగానికి సంబంధించి చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. మీరు విదేశాల నుండి ప్రయోజనం పొందుతారు. విదేశాల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కన్య (Virgo): సూర్యుడి సంచారం వల్ల మీరు అపారమైన ప్రయోజనాన్ని పొందుతారు. టెక్నాలజీ రంగాలతో అనుబంధం ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఈ సమయం అద్బుతంగా ఉంటుంది. మీ మనసు ఆనందంగా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio): సూర్యుడి రాశి మార్పు వల్ల మీ జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా రాజకీయాల్లో ఉన్నవారు లాభపడతారు. మీలో ధైర్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
మకరరాశి (Capricorn): సూర్యుడి సంచారం వల్ల మీ సోదరసోదరీమణుల సపోర్టు లభిస్తుంది. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. మీ పిల్లలు పనితీరు మిమ్మిల్ని గర్వపడేలా చేస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది.
Also Read: Grah Gochar 2022: ధనుస్సు రాశిలో సూర్య, శుక్రుల సంచారం.. ఈ 5 రాశులకు అపారమైన ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి