Surya-Shukra Gochar 2023: ప్రతి నెల అనేక గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన స్థానాన్ని మార్చుకుంటుంది. గ్రహాల రాజు సూర్యుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఇప్పటికే కుంభరాశిలో కూర్చున్నాడు. కుంభరాశిలో సూర్య, శుక్రుడి కలయిక వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో పెను మార్పు రానుంది. వీటి కలయిక ఏ రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మేషరాశి
సూర్యుడు మరియు శుక్రుడు సంయోగం మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
వృషభం
సూర్య-శుక్రల కలయిక వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్ లను పొదుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
మిధునరాశి
రాబోయే కాలం మిధున రాశి వారికి ప్రత్యేకంగా ఉండబోతుంది. సూర్యుడు మరియు శుక్రుడు కలయిక ఈ రాశి వారికి మంచి ధనాన్ని ఇవ్వనుంది. ప్రతి పనిలో అదృష్టం మీతో ఉంటుంది. మిథున రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. విదేశాలకు వెళ్లేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Rajyog: ఫిబ్రవరిలో అరుదైన రాజయోగం.. ఈ రాశులవారు కోటీశ్వరులవ్వడం పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook