Solar Eclipse 2022: ఏడాది చివరి సూర్య గ్రహణం సమయం, తేదీ ఎప్పుడు, దీపావళిపై ప్రభావం ఉంటుందా

Solar Eclipse 2022: పాక్షిక సూర్య గ్రహణం మరి కొద్దిరోజుల్లో కన్పించనుంది. ఆన్షిక్ సూర్య గ్రహణంగా పిలిచే ఈ సూర్య గ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. ఆ సూర్య గ్రహణం తేదీ, సమయం, దీపావళిపై ప్రభావం గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 8, 2022, 02:51 PM IST
Solar Eclipse 2022: ఏడాది చివరి సూర్య గ్రహణం సమయం, తేదీ ఎప్పుడు, దీపావళిపై ప్రభావం ఉంటుందా

Solar Eclipse 2022: ఈ ఏడాది సూర్య గ్రహణం అక్టోబర్ 25వ తేదీన ఏర్పడనుంది. అదే ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం. ఇది పాక్షిక సూర్య గ్రహణం కావడంతో యూరప్, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, నైరుతి ఆఫ్రికా ప్రాంతాల్లోనే కన్పిస్తుంది. దీపావళి పండుగపై ప్రభావం ఎలా ఉంటుందో ఆ వివరాలు మీ కోసం..

చంద్రుడి మధ్యభాగం నీడ భూమిపై పడకుండా ఉన్నప్పుడు భూమి ధృవ ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. వికీపీడియా సమాచారం ప్రకారం పాక్షిక సూర్య గ్రహణం రష్యా సమీపంలోని పశ్చి మ సైబీరియా ప్రాంతంలో కన్పించనుంది. 

ఇండియాలో సూర్య గ్రహణం సమయం

timeanddate.com వెబ్‌సైట్ ప్రకారం పాక్షిక సూర్య గ్రహణం ఢిల్లీలో కన్పించనుంది. పాక్షిక సూర్య గ్రహణం కన్పించే తొలి ప్రాంతం మద్యాహ్నం 2 గంటల 28 నిమిషాలు 21 సెకన్లకు ఉంటుంది. గరిష్ట సూర్య గ్రహణం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల 16 సెకన్లకు ఉంటుంది. పాక్షిక సూర్య గ్రహణం కన్పించే ప్రాంతం సాయంత్రం 6 గంటల 32 నిమిషాల 11 సెకన్లకు ఉంది. 

పాక్షిక సూర్య గ్రహణం అంటే ఏమిటి

పాక్షిక సూర్య గ్రహణాన్నే ఆన్షిక సూర్య గ్రహణం అని కూడా పిలుస్తారు. సంపూర్ణ సూర్య గ్రహణం ఉన్నప్పుడు సూర్యుడి డిస్క్ అంటే మధ్యభాగం చంద్రుడితో పూర్తిగా కప్పబడి ఉంటుంది. అదే పాక్షిక సూర్య గ్రహణంలో సూర్యుడి కొద్దిభాగం మాత్రమే చంద్రుడితో కప్పబడి ఉంటుంది. 

సూర్య గ్రహణంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు

ఇండియాలో సూర్య గ్రహణం సమయంలో బయటకు రాకుండా ఇళ్లలోనే ఉంటారు. ఆ సమయంలో ఏ విధమైన ఆహారాన్ని తీసుకోరు. దర్భగడ్డి, తులసి ఆకులను గ్రహణ ప్రభావం పడకుండా తినే ఆహారపదార్ధాలు, నీళ్ల వద్ద ఉంచుతారు. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి కొత్త బట్టలు ధరించడం మంచిదని నమ్ముతారు. దేశంలో చాలామంది సూర్యదేవుడికి పూజలు చేస్తారు. అటు గర్భిణీ మహిళలు కూడా ఇంట్లోనే ఉండటం మంచిదని చెబుతారు. 

సూర్య గ్రహణం సమయంలో కొంతమంది నీళ్లు కూడా తాగరు. గ్రహణం సమయంలో భోజనం వండటం, తినడం కూడా నిషేధముంది. ఈ సమయంలో ఏ పనీ చేయకుండా ఉంటారు. శుభ కార్యాలైతే అస్సలు చేయరు. 

Also read: Shukra Gochar 2022: దీపావళికి ముందు శుక్రుడి సంచారం.. అక్టోబరు 18 నుంచి ఈరాశులకు ఊహించని ధనలాభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News