Surya Grahanam: 2024లో మొదటి సూర్య గ్రహణం ఎపుడు ఏర్పడుతుంది.. ? పాటించ వలసిన నియమాలు..

Surya Grahanam 2024: సనాతన హిందూ ధర్మ శాస్త్రంలో సూర్యుడిని నవ గ్రహాల్లో మొదటి గ్రహంగా భావిస్తారు. కానీ సైన్స్ ప్రకారం సూర్యుడు ఒక నక్షత్రం. గ్రహాల విషయంలో జ్యోతిష్యం, సైన్య చెప్పే విషయాల్లో  కొన్ని తేడాలు ఉండొచ్చు. కానీ కొన్ని అంశాల్లో ఇవి చాలా దగ్గర దగ్గరా ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు అనాదిగా  సూర్యుడిని సూర్యనారయణుడిగా మనం పూజిస్తూ వస్తున్నాము.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2024, 10:53 AM IST
Surya Grahanam: 2024లో మొదటి సూర్య గ్రహణం ఎపుడు ఏర్పడుతుంది.. ? పాటించ వలసిన నియమాలు..

Surya Grahanam 2024: సూర్య గ్రహణం సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూలంగా పరిణమిస్తే.. మరికొన్ని రాశుల వారికీ కొంచెం కీడు చేసే అవకాశాలున్నాయి. ఈ యేడాది మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న ఫాల్గుణ మాసం అమావాస్య రోజున సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారిని కుబేరులను చేస్తోంది. అటు వంటి పరిస్థితుల్లో సూర్య గ్రహ సమయంలో కొన్ని రాశుల వారికి ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.  

సూర్య గ్రహణం 2024 మొదటి సూర్య గ్రహణం రాత్రి ప్రారంభం కాబోతుంది. సూర్య గ్రహణ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం అత్యంత కీలకమైనది.

సూర్య గ్రహణం 2024: ఈ సంవత్సరం, సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం రాత్రి ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఉగాది ముందు రోజు.. అనగా శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఫాల్గుణ మాసం అమావాస్య ఏప్రిల్ 8 రాత్రి 9.12 నిమిషాలకు గ్రహణం ప్రారంభమువుంది. ఇది తెల్లవారుఝాము 1.25 వరకు ఉంటుంది. ఇది మన దేశంలో ఎక్కడా కనిపించదు. కాబట్టి ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మన దేశస్తులకు ఎలాంటి సూతకం ఉండదు.

గ్రహణ సమయం శుభ కార్యాలకు నిషిద్ధం. ఈ కాలంలో గుడి తలుపులు మూసి ఉంటాయి. అదే సమయంలో శ్రీకాళహస్తిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రహణం కనిపించే ప్రదేశాల్లో సూతకం 12 గంటల ముందు ప్రారంభమవుతోంది. సూతకం సమయంలో వృద్దులు, చిన్న పిల్లలు మినిహా మిగతా వారు ఎలాంటి ఆహార పదార్ధాలు స్వీకరించవద్దు. గర్భిణి స్త్రీలు పండ్లు,కూరగాయలు  మొదలైనవాటిని కత్తిరించడం పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.

సూర్య గ్రహణం అమెరికాలోని 13 రాష్ట్రాల్లో కనిపించనుంది. ఈ గ్రహణం యూరప్, కెనడా, ఐర్లాండ్, నైరుతి, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆసియా, పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్ మహా సముద్రం, ఉత్తర ధృవం, దక్షిణ ధృవంతో పాటు ఇంగ్లాండ్‌లోని వాయువ్య ప్రాంతంలో చూడవచ్చు.

సూర్య గ్రహణం సమయంలో ఆచరించాల్సిన నియమాలు ?

గ్రహణ సమయంలో ఇష్టదేవత ప్రార్ధన అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుంది. నవ గ్రహ జపం, మృత్యుంజయ జపం జపించడం అత్యంత అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. గ్రహణ సమయంలో పట్టు స్నానం.. విడిచిన సమయంలో విడుప స్నానం చేసిన ఇష్ట దేవత ప్రార్ధన చేస్తే ఏమైనా గ్రహ దోషాలు ఉంటే పూర్తిగా తొలిగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News