Surya Grahan 2022: ఈ సారి దీపావళి రోజున సూర్యగ్రహం.. ఈ సమయాల్లో ఇలా చేయాలి..!

Surya Grahan October 2022 Date:  ప్రతి సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు వస్తాయి. 2022 సంవత్సరంలో కూడా ఇలానే వచ్చాయి. అయితే ఇంతకముందే రెండు గ్రహాలు కూడా సంభవించాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 11:34 AM IST
  • అక్టోబర్ 25న 2వ సూర్యగ్రహణం..
  • కావున దీపావళి రోజున
  • లక్ష్మీ దేవి మంత్రాలను పఠించండి
Surya Grahan 2022: ఈ సారి దీపావళి రోజున సూర్యగ్రహం.. ఈ సమయాల్లో ఇలా చేయాలి..!

Surya Grahan October 2022 Date:  ప్రతి సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు వస్తాయి. 2022 సంవత్సరంలో కూడా ఇలానే వచ్చాయి. అయితే ఇంతకముందే రెండు గ్రహాలు కూడా సంభవించాయి. ఇక రెండో సూర్య గ్రహం విషయానికొస్తే.. అక్టోబర్ 25న ఏర్పడడనుంది. దీని ప్రభావం భారత్‌లో కూడా ఉండే అవకాశాలున్నాయి. ప్రతి సంవత్సరం దీపావళిని అక్టోబర్‌ మాసంలో జరుపుకుంటారు. అయితే ఇదే రోజూ రాత్రి నుంచి గ్రహం ప్రారంభంకానుంది.  అదే ఈ గ్రహం ప్రభావం దీపావళి పూజపై పడే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

దీపావళి రోజున సూర్యగ్రహణం ఏ విధమైన ప్రభావం చూపబోతోంది:

కార్తీక మాసంలోని అమావాస్య రోజున దీపావళి పండగను జరుపుకుంటారు. అయితే సూర్యగ్రహం కూడా ప్రతి ఏటా అమావాస్య తిథి నాడు వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండగను అక్టోబర్ 24 న జరుపుకుంటారు. అయితే ఈ రోజున పండగపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఓ అరుదైన ఘట్టం కానిపించబోతోందని నిపుణులు అభిప్రాయపడున్నారు. దీపావళి రోజునా సూర్యగ్రహ ఛాయలు కనిపించడం చాలా అరుదైనప్పడికీ ఈ సంవత్సరం దీపావళి రోజునా మనకు కనిపించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దీపావళి రాత్రి నుంచే సూర్యగ్రహం:

అక్టోబర్ 25 మధ్యాహ్నం 02:29 నుంచి 3 గంటల పాటు సూర్యగ్రహణం కొనసాగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే అక్టోబర్‌ 24న రాత్రి 12 గంటల సమయం నుంచే ప్రారంభం కావడం విశేషం. అయితే ఇదే క్రమంలో ఇళ్లలో, పరిశ్రమల్లో  పూజలు కూడా జరుగుతాయి. అలాంటి సందర్భంలో పూజపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పూజ క్రమంలో లక్ష్మీ దేవి మంత్రాలను పఠించడం వల్ల ఎలాంటి చెడు పరిణామాలు జరగవని నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x