Surya Rashi Parivartan: వచ్చే నెలలో రాశిని మార్చనున్న గ్రహాల రాజు... ఈ రాశులకు డబ్బే డబ్బు..

Surya Gochar February 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో గ్రహాల రాజు సూర్యుడు మకరరాశి నుండి కుంభరాశికి వెళ్తాడు. ఇది మొత్తం 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 11:56 AM IST
Surya Rashi Parivartan: వచ్చే నెలలో రాశిని మార్చనున్న గ్రహాల రాజు... ఈ రాశులకు డబ్బే డబ్బు..

Surya Rashi Parivartan February horoscope 2023: జ్యోతిషశాస్త్రంలో సూర్య సంచారాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గ్రహాల రాజు అయిన సూర్యుడు ఫిబ్రవరి 13న తన రాశిని మార్చుకుని మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనికి కొన్ని రోజుల ముందు ఫిబ్రవరి 7న బుధుడు తన రాశిని మార్చుకుని మకరరాశికి చేరుకుంటాడు. మరోవైపు ఫిబ్రవరి 15న శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. గ్రహాల కదలికలో ఈ మార్పులు మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తాయి.

మేషం (Aries)- ఫిబ్రవరిలో భూ ఒప్పందాల నుండి పెద్ద ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. 
వృషభ రాశి (Taurus)- వృషభ రాశి వారికి ఫిబ్రవరి శుభదినం. మీకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు వస్తాయి.
మిథునరాశి (Gemini)- మిథున రాశి వారికి ఈ మాసం కష్టంగా ఉంటుంది. పని ప్రదేశంలో ఆటంకాలు ఏర్పడతాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు కష్టపడి పని చేసిన తర్వాత మాత్రమే ఫలితాలు పొందుతారు.
కర్కాటకం (cancer)- కర్కాటక రాశి వారికి ఈ మాసం డబ్బు పరంగా బాగానే ఉంటుంది. మిత్రుల సహకారంతో వ్యాపారం పెరుగుతుంది.
సింహ రాశి (Leo)- సింహ రాశి వారికి ఫిబ్రవరి 14 నుండి 16 మధ్య గృహ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధన లాభం ఉంటుంది.
కన్య (Virgo)- కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులు మరియు అధికారుల మద్దతు లభిస్తుంది. భార్య ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.
తులారాశి (Libra) - తులారాశి వారికి ఫిబ్రవరి నెల ఇబ్బందికరంగా ఉంటుంది. కష్టపడి పనిచేసినా మీకు విజయం లభించదు.

వృశ్చిక రాశి (Scorpio)- వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీ జీవితంలో సంతోషం వస్తుంది. చెడిపోయిన పని జరుగుతుంది. భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)- ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి గ్రహాల స్థితి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. షేర్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు లాభాలను పొందుతారు.
మకరం (Capricorn)- సూర్యుడు మరియు ఇతర గ్రహాల మార్పు కారణంగా మానసిక క్షోభకు గురవుతారు.  పిల్లల గురించి ఆందోళన పెరగవచ్చు. 
కుంభం (Aquarius)- కుంభ రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్‌లో అఖండ విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఆఫీసులో కొత్త బాధ్యతలను తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది, వ్యాపారులు భారీగా ప్రయోజనాలు పొందుతారు. 
మీనం (Pisces)- ఈ మాసం మీన రాశి వారికి ఆర్థిక పురోగతిని కలిగిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.

Also Read: Gajkesri Rajyog: గురు-చంద్రుల అరుదైన యోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News