Sun Transit 2023: సూర్యుని అనుగ్రహంతో ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.. మీ రాశి ఉందా?

Sun Transit 2023:  రీసెంట్ గా సూర్యుడు వృషభరాశి ఎంటర్ అయ్యాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆదిత్యుడి గోచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 16, 2023, 06:43 PM IST
Sun Transit 2023: సూర్యుని అనుగ్రహంతో ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.. మీ రాశి ఉందా?

Surya Gochar 2023: నిన్ననే సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో ఆదిత్యుడు జూన్ 15 వరకు ఉంటాడు. భానుడు రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. సూర్య సంచారం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి- ఆదిత్యుడి అనుగ్రహం కారణంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
సింహం- మీ లైఫ్ పార్టనర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీరే తీసుకుంటారు. మీరు మానసికంగా ధృడంగా ఉంటారు. మీకు సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 
తుల రాశి- మీకు బాధ్యతలు పెరుగుతాయి. మీరు అత్తమామల వైపు నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు బరువు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి వ్యాయామం చేస్తే మంచిది అంతేకాకుండా మంచి డైట్ ఫాలో అయితే మంచిది.

Also Read: Saturn Retrograde 2023: త్వరలో ఈ రాశుల వారిపై ఆగ్రహించబోతున్న శని.. మీ రాశి ఉందా?

వృశ్చికం- సూర్య సంచారంతో మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ పనులన్నీ అనుకున్న సమయానికి జరుగుతాయి. ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
వృషభం- సూర్య సంచారం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ ఆత్మీయుల కోసం ఏదైనా చేయాలన్న చేస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 
మిథునం - మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ డబ్బు వృథా అవుతుంది. మీరు పెళ్లి లేదా ఇతర పనుల కోసం డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు ఇతరులతో సంబంధాలు బలపడతాయి. 

Also Read: Surya Mahadasha: సూర్యుడి మహాదశ ఎఫెక్ట్... మీపై ఆరు సంవత్సరాలు డబ్బు వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News