Surya Gochar 2023: ఈ నెల మొత్తం లాభాలు పొందబోయే రాశులవారు వీరే..మీ రాశి కూడా ఉందా?

Surya Gochar 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా ఈ కింది రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 09:48 AM IST
Surya Gochar 2023: ఈ నెల మొత్తం లాభాలు పొందబోయే రాశులవారు వీరే..మీ రాశి కూడా ఉందా?

 

Surya Gochar 2023: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలకు రాజుగా సూర్యుడు వ్యవహరిస్తాడు. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంది. సూర్యుడు అక్టోబర్ 18న తులారాశిలోకి సంచారం చేయబోతోంది. తుల రాశిని పాలించే గ్రహం శుక్రుడే..కాబట్టి కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభ సమయం ప్రారంభం కాబోతోంది. అక్టోబర్‌ 18న జరిగే సూర్యుడి సంచారం కారణంగా ఏయే రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మిథునరాశి వారికి సూర్యగ్రహ సంచారం కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జీవితంలో అనేక లాభాలు పొందేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో మంచి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వీరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పెట్టుబడులు పెట్టేవారికి దీర్ఘకాలిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

సూర్య గ్రహం సంచారం కారణంగా తుల రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో తుల రాశివారు ఆర్థిక పురోగతిని పొందుతారు. అంతేకాకుండా జీవితంలో కూడా ఆదనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. నిలిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఆగిపోయిన ప్రాజెక్ట్స్‌ ప్రారంభమవుతాయి. వీరు ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. 

ఈ సమయం మీన రాశివారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి  కార్యాలయంలో సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన ఈ సమయంలో సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ సూర్యుడి సంచారం కారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి పురోగతి కూడా లభిస్తుంది. ఈ సమయంలో వీరు భూమి, భవనం, వాహన కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News