Surya Gochar 2023: ఏడాది తర్వాత శని రాశిలో సూర్య-శుక్ర సంయోగం.. ఈ రాశులపై డబ్బు వర్షం..

Surya And Venus Conjunction 2023: ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు తన రాశిని మార్చి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు భారీగా ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2023, 08:34 AM IST
Surya Gochar 2023: ఏడాది తర్వాత శని రాశిలో సూర్య-శుక్ర సంయోగం.. ఈ రాశులపై డబ్బు వర్షం..

Surya Shukra Yuti in kumbh 2023:  గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఫిబ్రవరి నెలలో సూర్యుడు తన గమనాన్ని మార్చి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే శని, శుక్రుడు అదే రాశిలో సంచరిస్తున్నారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మరియు విజయాన్ని ఇచ్చే సూర్య గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.  ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

సూర్య-శుక్రుల కలయిక ఈ రాశులకు శుభప్రదం
మేషం: సూర్యుడు, శుక్రుడు కలయిక వల్ల మేషరాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. ఈ వ్యక్తులు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు.
వృషభం: వృషభ రాశి వారికి సూర్య, శుక్రుల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరు పెద్ద ప్యాకేజీతో జాబ్ సంపాదిస్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. బాస్‌తో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు లాభపడతారు.
మిథునం : మిథునరాశి వారికి సూర్య, శుక్రుల కలయిక భారీగా సంపదను ఇస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అదష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. మెుత్తం మీద ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Astrology: ఛాయా గ్రహం గమనంలో పెను మార్పు.. ఈ 4 రాశుల ఇళ్లు నోట్ల కట్టలతో నిండటం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News