Shadashtak Yog 2022: సూర్య, రాహు షడష్టక యోగం... సెప్టెంబర్ 17 నుంచి ఈ 5 రాశులవారు బీ అలర్ట్!

Shadashtak Yog 2022: మరో నాలుగు రోజుల్లో  గ్రహాల రాజు సూర్యుడు, ఛాయా గ్రహం రాహువు షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది అశుభకరమైన యోగం. ఈ సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2022, 09:16 AM IST
Shadashtak Yog 2022: సూర్య, రాహు షడష్టక యోగం... సెప్టెంబర్ 17 నుంచి ఈ 5 రాశులవారు బీ అలర్ట్!

Shadashtak Yog 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహ సంచారం మానవ జీవితంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల రాజు సూర్యభగవానుడు ఈ నెల 17న తన సొంత రాశి అయిన సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే సమయంలో రాహువు మేషరాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం జ్యోతిషశాస్త్రంలో అశుభకరమైన యోగం (Shadashtak Yog 2022) పరిగణిస్తారు. సూర్యుడు, రాహువుల వల్ల ఏర్పడే షడష్టక యోగం వల్ల 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. 

వృషభం (Taurus): షడష్టక యోగం వృషభ రాశి వారికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ రాశివారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా వీరు మానసికంగా కూడా ఒత్తిడికి గురి అవుతారు. 

మిథునం (Gemini): షడష్టక యోగం వల్ల మిథునరాశి వారి ఆరోగ్యం దెబ్బతింటుంది, మానసిక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా మిత్రులు, బంధువులతో సంబంధాలు చెడిపోవచ్చు. కావున మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 

సింహం (Leo): షడష్టక యోగం వల్ల సింహ రాశి వారి నిర్ణయాధికారం దెబ్బతింటుంది. మీరు మాటలను అదుపులో ఉంచుకోకపోవడం వల్ల కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఈసమయంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నంచండి. 

మకరం (Capricorn): షడష్టక యోగం ఈ రాశివారి యెుక్క వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలు క్షీణించవచ్చు. అంతేకాకుండా మకర రాశి వారు మానసిక ఒత్తిడికి గురికావచ్చు.  

కుంభం (Aquraius): కుంభ రాశి వారికి షడష్టక యోగం ఆర్థికంగా నష్టాలను మిగులుస్తుంది.  విపరీతంగా ఖర్చులు పెరగడంతో ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోంటారు.  

Also Read: Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News