Surya Gochar 2023: ఏప్రిల్ లో ఒకే రాశిలో కలవబోతున్న రాజు-యువరాజు.. ఈ 5 రాశులవారికి జాక్ పాట్ పక్కా..

Surya Gochar 2023: వచ్చే నెలలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. దీంతో 5 రాశులవారికి మేలు జరగనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 01:03 PM IST
Surya Gochar 2023: ఏప్రిల్ లో ఒకే రాశిలో కలవబోతున్న రాజు-యువరాజు.. ఈ 5 రాశులవారికి జాక్ పాట్ పక్కా..

Surya Gochar 2023: సూర్యుడు 14 ఏప్రిల్ 2023, శుక్రవారం మధ్యాహ్నం 02.42 గంటలకు మేషరాశిలో సంచరించనున్నాడు. సూర్యదేవుడు మే 15 వరకు మేషరాశిలోనే ఉంటాడు. ఇదే రాశిలోకి ఇవాళ మధ్యాహ్నం 2.44 గంటలకు మేషరాశిలో సంచరించనున్నాడు. ఈరెండు గ్రహాలు మేషరాశిలో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాయి. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.

మిధునరాశి
బుధుడు మిథునరాశి యెుక్క 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో మీరు ఆర్థిక లాభాలు పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. బుధవారం పచ్చ ఉంగరాన్ని ధరించడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. 
కర్కాటక రాశి
కర్కాటక రాశి యెుక్క 10వ ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. దీంతో మీరు కెరీర్‌లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ప్రతి బుధవారం ఆవుకు పచ్చి మేత తినిపించండి.
సింహరాశి 
సింహరాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో బుధుడు సంచరించిన కారణంగా అదృష్టం మీ వెంట ఉంటుంది. మీరు పని ప్రారంభించే ప్రాజెక్ట్‌లో మీరు విజయం సాధిస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. కన్సల్టెంట్లు, రచయితలు, తత్వవేత్తలు, ఉపాధ్యాయులు తమ తమ రంగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను పొందుతారు. బుధవారం పప్పు తింటే శ్రేయస్కరం.

ధనుస్సు రాశి
మెర్క్యూరీ ధనుస్సు యొక్క ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీరు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇదే సరైన సమయం. బాలికలకు విద్యా సామగ్రిని దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కుంభ రాశి
కుంభరాశి యొక్క మూడవ ఇంటిలో బుధుడు సంచరిస్తాడు. టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఫ్యామిలీతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. ఆఫీసులో మీ బాస్ మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. పదోన్నతి పొందే అవకాశాలున్నాయి.

Also Read: Budh Gochar 2023: కొన్ని గంటల్లో మేషరాశిలోకి బుధుడు... రాత్రికి రాత్రే ధనవంతులు కానున్న రాశులివే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News