Sun Transit 2024: సూర్యగ్రహం రోహిణి నక్షత్రంలోకి.. 4 రాశుల వారికి ఈ రోజు నుంచి డబ్బే డబ్బు!

Suryagraha In Rohini Nakshatra 2024: రోహిణి నక్షత్రం లోకి సూర్యుడు మే 25వ తేదీన ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ రోజు నుంచి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయని వారంటున్నారు. ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 26, 2024, 12:44 PM IST
Sun Transit 2024: సూర్యగ్రహం రోహిణి నక్షత్రంలోకి.. 4 రాశుల వారికి ఈ రోజు నుంచి డబ్బే డబ్బు!

 

Suryagraha In Rohini Nakshatra 2024: సూర్యగ్రహం ప్రతినెల ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఇలా చేసే సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే సూర్యగ్రహం అప్పుడప్పుడు మాత్రమే రాసి సంచారానికి బదులుగా నక్షత్ర సచారాలు చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా సూర్యుడు కృత్తికా నక్షత్రం నుంచి మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి సంచారం చేశాడు. రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చెయ్యడాన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తాడు ఎందుకంటే ఈ నక్షత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే సూర్య భగవానుడు ఈ రోహిణి నక్షత్రం లోకి సంచారం చేయడంతో మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు లాభాలు పొందుతే మరికొన్ని రాశుల వారు కొన్ని దుష్ప్రభావాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. 

మేషరాశి:
సూర్యుడు నక్షత్ర సంచారం చేయడం కా రణంగా మేష రాశి వారి వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పురోగతి లభించడమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని వారంటున్నారు. ముఖ్యంగా సమాజానికి దగ్గరగా ఉండి పని చేస్తున్న వారికి ఈ సమయంలో పేరు ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో కొన్ని పనుల కారణంగా విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఈ సమయంలో వీరికి ఉన్నత అధికారుల మద్దతు కూడా లభిస్తుంది.

కర్కాటక రాశి:
సూర్యభగవానుడి ఆశీస్సులతో కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్‌తో పాటు ఇంక్రిమెంట్ లభించడమే, కాకుండా ఉన్నత అధికారులకు సపోర్టు లభించి ప్రశంసలు అందుకుంటారు.  దీంతోపాటు జీవితంలో సానుకూల మార్పులు లభిస్తాయి. అలాగే వీరికి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారంలో ఈ రాశి వారికి వస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

కన్యారాశి:
సూర్యగ్రహం నక్షత్ర సంచారం చేయడంతో కన్యా రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ సమయంలో వీరికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మొత్తం పూర్తవుతాయి. అంతేకాకుండా అదృష్టం పెరిగి ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే వారి కోరికలు సులభంగా నెరవేరుతాయి. అలాగే వీరికి ఆకస్మిక ధన లాభాలు కలగడమే కాకుండా కొత్త ఆదాయ వనరుల లభిస్తాయి. వీరు ఈ సమయంలో కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ధనస్సు రాశి: 
రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడం కారణంగా ధనస్సు రాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబంలో వస్తున్న సమస్యలు సులభంగా పరిష్కారమవ్వడంతో ఎప్పుడు పొందలేని సంతోషాన్ని అలాగే ధన ప్రవాహం కూడా పెరిగి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థుల కోరికలు నెరవేరబోతున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఈ సమయంలో సులభంగా తిరిగి వస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలావరకు మెరుగుపడబోతున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News