Sun Transit In Rohini Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు అధిపతిగా గురువుగా పరిగణిస్తారు. మే 25వ తేదీన మధ్యాహ్నం ఈ సూర్యగ్రహణం తన నక్షత్రాన్ని వదిలి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. కృష్ణ పక్షం రెండవ రోజున సూర్యుడు కృత్తికా నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ గ్రహం జూన్ 8వ తేదీ వరకు అదే నక్షత్రంలో సంచార దశలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో భక్తులంతా సూర్య భగవానుడిని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించడం వల్ల జీవితంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇదిలా ఉండగా సూర్యుడు నక్షత్ర సంచారం చేయడం కారణంగా వాతావరణంలోని ఉష్ణోగ్రతలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి.
ఇలా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని చాలామంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ సమయంలో సూర్యభగవానుడిని పూజిస్తారు. అంతేకాకుండా పెరుగు పాలు కొబ్బరి నీళ్లు చల్లని పానీయాలను ఈ సమయంలో దానం చేస్తారు. సూర్యగ్రహం అశుభ స్థానంలో ఉన్న రాశుల వారు ఇలా దానం చేయడం వల్ల సూర్యుడు జాతకంలో బలంగా మారే అవకాశాలున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని విషవాయువులు వెలుపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రజలు అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంటి నుంచి బయటకు కూడా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మహిళల విషయానికొస్తే, ఈ సమయంలో వారి శరీరాలను చల్లగా ఉంచుకోవడానికి చేతులకు పాదాలకు మెహిందీని పెట్టుకుంటూ ఉంటారు. ఇలా మెహేందిని పెట్టుకోవడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. అలాగే శరీరానికి అవసరమైన గ్లూకోజ్ స్థాయిలు కూడా అందుతాయని వారి నమ్మకం. మరికొందరైతే ఈ సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరిస్తారు.
ఈ రాశుల వారికి లాభాలే లాభాలు:
సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
వృషభ రాశి:
సూర్యుడు నక్షత్ర సంచారం చేయడం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించి జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
మిధున రాశి:
మిధున రాశి వారికి కూడా సూర్యుడి నక్షత్ర సంచారం చాలా కలిసి వస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వీరు విహారయాత్రలకు వెళ్తారు. దీనికి కారణంగా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే స్నేహితుల నుంచి సపోర్టు లభించి విపరీతమైన లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి అనుకున్న వాటికంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఆరోగ్యం మెరుగుపరడమే కాకుండా ఆర్థికంగా బలంగా ఉంటారు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sun Transit 2024: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు.. వాతావరణంలో మార్పులతో పాటు ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!