Surya Gochar 2023: ఈ నెల 15న మీన సంక్రాంతి.. ఈ 3 రాశుల జీవితాల్లో కాంతి..

Sun Transit 2023: ఈ నెల 15న సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి మీనరాశి ప్రవేశం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 04:12 PM IST
Surya Gochar 2023: ఈ నెల 15న మీన సంక్రాంతి.. ఈ 3 రాశుల జీవితాల్లో కాంతి..

Surya Gochar 2023 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని  ఛేంజ్ చేస్తుంది. సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. సూర్యుడు మార్చి 15న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏ రాశుల వారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

సూర్య సంచారం ఈ రాశులకు వరం
కర్కాటక రాశి
సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల మీ కష్టాలన్నీ తీరుతాయి. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులు కోరికలు నెరవేరుతాయి. కర్కాటకరాశి వారికి అదృష్టం పట్టనుంది. ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. 
మిధునరాశి
సూర్యుని సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉండబోతుంది. 
వృషభం
సూర్యుడి రాశి మార్పు వల్ల వృషభరాశి వారు అపారమైన ప్రయోజనం పొందబోతున్నారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. పెట్టుబడులు లాభాలను తెస్తాయి. స్టాక్ మార్కెట్ లేదా బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టడం భారీగా లాభం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

Also read: Shani Dev: శనిదేవుడికి ఇష్టమైన రాశులివే... ఇందులో మీ రాశి కూడా ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News