Grah Gochar 2023: తండ్రీ కొడుకులు ఈ 3 రాశులవారిని 2023లో ధనవంతులను చేస్తారు.. ఇందులో మీరున్నారా?

Saturn Sun Transit 2023: జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మరియు శని గ్రహాలు చాలా ముఖ్యమైనవి. వీరి స్థానంలో చిన్న మార్పు వచ్చినా సరే అది ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 09:08 AM IST
Grah Gochar 2023: తండ్రీ కొడుకులు ఈ 3 రాశులవారిని 2023లో ధనవంతులను చేస్తారు.. ఇందులో మీరున్నారా?

Saturn Sun Transit 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు నెలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. మరోవైపు శని గ్రహం రెండున్నరేళ్లలో తన రాశిని మార్చుకుంటుంది. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని శనిగ్రహానికి తండ్రిగా భావిస్తారు. కానీ ఈ రెండు గ్రహాలకు శత్రుత్వం ఉంది. అయితే కొత్త ఏడాదిలో కుంభరాశిలో శని, సూర్యల కలయిక జరగబోతుంది. జనవరి 17న శనిదేవుడు కుంభంలోకి ప్రవేశిస్తే.. ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు అదే రాశిలో సంచరిస్తాడు. శనిదేవుడి యెుక్క సొంత గ్రహమైన కుంభంలో తండ్రీకొడుకల సంయోగం గొప్ప జ్యోతిష్య ఘట్టం. ఈ సంఘటన ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. అయితే ఏ రాశివారికి సూర్య, శని కలయిక శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

మేష రాశి (Aries): శని మరియు సూర్యుని కలయిక మేషరాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. ధనం పొందేందుకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. పాత పెట్టుబడి నుండి లాభం పొందుతారు.  పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారాల్లో మీరు లాభం పొందుతారు. 
కర్కాటక రాశి (Cancer): కుంభరాశిలో సూర్యుడు, శని కలయిక వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కెరీర్ మార్చుకోవాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. 
తులా రాశి (Libra): సూర్యుడు మరియు శని సంయోగం తుల రాశి వారికి బలమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ వ్యక్తులకు కెరీర్ మరియు ఆర్థిక స్థితి పరంగా అద్భుతంగా ఉంటుంది. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. మీ ప్రేమ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు. 

Also Read: Mangal Gochar 2023: అంగారకుడి ప్రత్యక్ష సంచారం.. సంక్రాంతి వీరి జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News