Shadashtak Yog: సూర్య-రాహువుల 'షడష్టక యోగం'.. ఈ రాశులవారికి శాపం!

Surya-Rahu Yuti 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, రెండు గ్రహాల కలయిక అన్ని రాశుల వారిపై శుభ మరియు అశుభ ప్రభావాలను ఇస్తుంది. ఇటీవల సూర్యుడు కన్యారాశిలోకి రావడంతో సూర్యుడు, రాహువు కలయిక వల్ల షడష్టక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఏ రాశులవారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2022, 03:43 PM IST
Shadashtak Yog: సూర్య-రాహువుల 'షడష్టక యోగం'.. ఈ రాశులవారికి శాపం!

Shadashtak Yog 2022 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడు లేదా మరొక గ్రహంతో సంయోగించినప్పుడు, అది అన్ని రాశులవారి జీవితాలపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపుతుంది. రీసెంట్ గా అంటే సెప్టెంబరు 17న సూర్యుడు సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించాడు. రాహువు ఇప్పటికే మేషరాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు కలిసి (Surya Rahu Yuti 2022) షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి.  ఈ యోగం చాలా అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ యోగం కారణంగా ఇంటి పెద్ద మరణించవచ్చు లేదా ఏదైనా విపత్తు తలెత్తువచ్చు.  

షడష్టక యోగం ఎలా ఏర్పడుతుంది?
జాతకంలో ఎప్పుడైతే రెండు గ్రహాలు ఆరో, ఎనిమిదో ఇంట్లో ఉంటాయో, అప్పుడు షడష్టక యోగం (Shadashtak Yog 2022) ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ప్రజలు దుఃఖం, రోగాలు, అప్పులు, చింతలు, దురదృష్టాలు మరియు బాధలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈసారి సూర్యుడు, రాహువు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం వల్ల ఏ రాశుల వారికి కష్టకాలం దాపురించిందో తెలుసుకుందాం.  

వృషభం (Taurus)- ఈ రాశి వారికి ఈ సమయం బాధాకరంగా ఉంటుంది. ఈ టైంలో ఎవరైనా కీలక నిర్ణయాలు తీసుకుంటే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశుల వారికి మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి.
మిథునరాశి (Gemini)- షడష్టక యోగం ఈ రాశివారి ఆరోగ్య మరియు మానసిక సమస్యలను పెంచుతుంది. స్నేహితులు మరియు బంధువులతో సంబంధాలు దెబ్బతినవచ్చు, కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి.
సింహ రాశి (Leo)- ఈ కాలంలో సింహ రాశివారి నిర్ణయాధికారం ప్రభావితం కావచ్చు. మీ ప్రసంగ లోపాలు ఆర్థికంగా మరియు కెరీర్‌కు హాని కలిగిస్తాయి. అందువల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
మకరం (Capricorn)- షడష్టక యోగం వల్ల ఈ రాశివారు ఆఫీసులో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. సహోద్యోగులతో సంబంధాలు క్షీణించవచ్చు మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
కుంభం (Aquarius)- ఈ సమయంలో పెరుగుతున్న ఖర్చులు కారణంగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మీ భర్త అనారోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటంది.

Also Read: Shukra Gochar 2022: మరో 5 రోజుల్లో రాశిని మార్చబోతున్న శుక్రుడు... నవరాత్రులలోపు ఈ రాశుల వారికి అదృష్టం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News