These 3 zodiac sign peoples will get huge money due to Ram Navami 2023: హిందూ మతంలో చాలా మంది దేవుళ్లు మరియు దేవతలు ఉన్నారు. నిత్యం ప్రజలు వారిని పూజిస్తారు. అంతేకాదు వారికి సంబంధించిన పండుగలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇక శ్రీరాముని అనుగ్రహం పొందాలనుకుంటే.. ఆయనను పూజించడానికి శ్రీరామ నవమి అత్యంత పవిత్రమైన రోజు. శ్రీరామ నవమి రోజున మాత్రమే శ్రీరాముడు భూమిపైకి వచ్చాడు అని మత విశ్వాసాలు చెబుతున్నాయి. పంచాంగం ప్రకారం.. చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి నాడు శ్రీరామ నవమిని జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామ నవమిని మార్చి 30న జరుపుకుంటారు.
2023 శ్రీరామ నవమిని రోజున చాలా పవిత్రమైన మరియు అరుదైన యోగం ఏర్పడుతోంది. పండితుల ప్రకారం రామ నవమి నాడు అమృత సిద్ధి యోగం, గురు పుష్య యోగం మరియు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ మూడు యోగాలు రాశులను ప్రభావితం చేస్తాయి. విశేషమేమిటంటే మార్చి 30న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.59 గంటల వరకు అమృత సిద్ధి యోగం, సర్వార్థసిద్ధి యోగం ఉంటుంది. దీని కారణంగా 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
సింహ రాశి:
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ యోగం సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. శ్రీరాముడి దయతో విజయం సాధిస్తారు. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. పలు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. వ్యాపారం మరియు ఉద్యోగాలలో కూడా లాభం ఉంటుంది.
తులా రాశి:
తులా రాశి వారికి శ్రీరామ నవమి చాలా ఫలవంతంగా ఉంటుంది. శ్రీరామ నవమి రోజు మీరు శుభవార్త పొందవచ్చు. వివాహం కాని వారికి సంబంధాలు రావచ్చు. ఇది కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే బలంగా ఉంటుంది. మీ కీర్తి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటుంది.
వృషభం:
శ్రీరామ నవమి రోజు వృషభ రాశి వారికి అదృష్టం తలుపులు తెరుస్తుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. అది కూడా శ్రీరామ నవమి రోజున చేయవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి.
Aslo Read: Guru Asta 2023: గురు అష్ట 2023 ప్రభావం.. ఈ 5 రాశుల వారికి ఎదురుదెబ్బలు పక్కా! ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.