Vijayawada Dasara Navaratri Celebrtions: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మూలానక్షత్రం సందర్భంగా జ్ఞాన సరస్వతీ అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో తెల్లవారు జాము మూడింటి నుంచే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆలయానికి భక్తులు పోటెత్తడం తో వీఐపీ, వీవీఐపీ, అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. అన్ని లైన్ల నుంచి ఉచిత దర్శనాలే కొనసాగుతున్నాయి.
*
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చి మధ్యాహ్నం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకుంటారని సమాచారం.
ముఖ్యమంత్రి అంతరాలయంలో ఉన్నప్పటికీ సామాన్య భక్తుడిగానే దర్శనం చేసుకోనున్నారు. ఉత్సవాల్లో కీలకమైన ఇవాళ 2లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు క్యూలో ఉన్న భక్తులకు మంచి నీళ్లతో పాటు ప్రసాదం పంపిణి చేయనున్నట్టు సమాచారం.
నవరాత్రులు భాగంగా మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దసరా రోజున దుర్గమ్మను కృష్ణానదిలో హంస వాహనంపై ఊరేగించడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులతో పూజలు అందుకుంటూ భక్తులకు అభయం అందిస్తున్నారు.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter