Sravana masam 2022: శ్రావణమాసంలో ఈ మొక్కలు నాటితే..సిరిమంతులవడం ఖాయం

Sravana masam 2022: శ్రావణమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. భక్తిశ్రద్ధలతో చేసే ప్రతి పని అంతులేని సంపదను తెచ్చిపెడుతుంది. వాస్తుప్రకారం ఈ మొక్కలు నాటితే..శివుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 7, 2022, 09:28 PM IST
Sravana masam 2022: శ్రావణమాసంలో ఈ మొక్కలు నాటితే..సిరిమంతులవడం ఖాయం

Sravana masam 2022: శ్రావణమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. భక్తిశ్రద్ధలతో చేసే ప్రతి పని అంతులేని సంపదను తెచ్చిపెడుతుంది. వాస్తుప్రకారం ఈ మొక్కలు నాటితే..శివుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 

హైందవ మతం ప్రకారం శ్రావణమాసం చాలా ప్రత్యేకమైంది, మహత్యం కలిగినది. శివుడికి ఇష్టమైన ఈ నెలలో ప్రత్యేక పూజలతో, శివుడికి ఇష్టమైన పనులతో ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. శ్రావణమాసంలో సోమవారం వ్రతాలు, ప్రత్యేక పూజలతో పాటు వాస్తుశాస్త్రం సూచించే కొన్ని మొక్కల్ని నాటడం ద్వారా కూడా శివుడి కటాక్షం లభిస్తుందట. అంతేకాదు..మీ ఇంట అంతులేని సిరిసంపదలు కలుగుతాయి.

అన్నింటికంటే ముఖ్యమైన మొక్క తులసి. తులసి మొక్కకు హిందూమతంలో విశేష ప్రాధాన్యత ఉంది. దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటుంది. ఉదయం ప్రతిరోజూ తులసి మొక్కకు పూజలు చేస్తుంటారు. ఇంటికి నార్త్‌ఈస్ట్ దిశలో తులసి మొక్క నాటడం వల్ల శుభసూచకంగా భావిస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. తులసి మొక్క నాటడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణు భగవానుడి కటాక్షం లభిస్తుందంటారు. 

ధతురా మొక్కకు జ్యోతిష్యశాస్త్రంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ మొక్కలోనే శివుడు ఆవాసముంటాడని అంటారు. అందుకే ఆదివారం, మంగళవారం రోజుల్లో ఇంట్లో బ్లాక్ ధతురా మొక్క నాటమని సూచిస్తున్నారు. అద్భుత లాభాలు కూడా ఉంటాయి. శివుడి కటాక్షం లభిస్తుంది. 

చంపా మొక్కకు కూడా జ్యోతిష్యం ప్రకారం విశేష ప్రాధాన్యత ఉంది. ఇంట్లో అరటి, చంపా, కేతకీ మొక్కలు శుభసూచకంగా భావిస్తారు. ఈ మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే..అనేక లాభాలు కలుగుతాయి. చంపా మొక్క సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ మొక్కను నార్త్‌వెస్ట్ దిశలో ఉంచాలి.

అరటి మొక్కలకు జ్యోతిష్యశాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది. ఇవి నెగెటివ్ శక్తుల్ని దూరం చేస్తాయి. ఇంట్లో అరటిమొక్కల్ని ఉంచడం శుభసూచకం. తులసి మొక్కలు, అరటి మొక్కలు రెండింటినీ కలిపి ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటి ముఖద్వారం వద్ద కుడివైపున తులసి మొక్క, ఎడమవైపున అరటి మొక్క అమర్చుకోవాలి.

షమీ మొక్కను వాస్తుశాస్త్రం ప్రకారం మంచిదిగా భావిస్తారు. షమీ మొక్కను ఇంట్లో అమర్చడం వల్ల కుటుంబసభ్యులకు లాభం కలుగుతుంది. షమీ మొక్కను పూజించడం వల్ల శనిదేవుడి కటాక్షం లభిస్తుంది. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. తులసి మొక్కతో పాటుగా షమి మొక్కను నాటితే.అనేక లాభాలుంటాయి. 

Also read: Venus Transit 2022: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి జాక్ పాట్! ప్రమోషన్ పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News