Solar Eclipse 2022: అక్టోబర్ 25న సూర్యగ్రహణం.. దీపావళి, గోవర్ధన పూజపై ప్రభావం ఉంటుందా?

Will Solar Eclipse 2022 affect Diwali. ఈ ఏడాది వచ్చే సూర్యగ్రహణ ప్రభావం దీపావళి, గోవర్ధన పూజలపై ఉంటుందా లేదా అనే విషయం ఓసారి తెలుసుకుందాం.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 22, 2022, 04:34 PM IST
  • అక్టోబర్ 25న సూర్యగ్రహణం
  • దీపావళి, గోవర్ధన పూజపై ప్రభావం ఉంటుందా?
  • దీపావళి పండుగ ఎప్పుడంటే
Solar Eclipse 2022: అక్టోబర్ 25న సూర్యగ్రహణం.. దీపావళి, గోవర్ధన పూజపై ప్రభావం ఉంటుందా?

Will Solar Eclipse 2022 affect Diwali and Govardhana Puja: సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు.. భూమిపై దాని నీడ పడుతుంది. దీనినే 'సూర్యగ్రహణం' అని అంటారు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. అంటే దీపావళి మరుసటి రోజు. ఈ రోజు గోవర్ధన పూజ కూడా ఉంటుంది. భారత కాలమానం ప్రకారం.. సూర్యగ్రహణం అక్టోబర్ 25 సాయంత్రం 4:29న ప్రారంభమై సాయంత్రం 5:24 వరకు ఉంటుంది. దాంతో దీపావళి, గోవర్ధన పూజలపై సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది. అందుకే సూర్యగ్రహణం రోజున ప్రజలు ఏ సమయంలో పూజించవచ్చో ఓసారి వివరంగా  తెలుసుకుందాం.

దీపావళి ఎప్పుడంటే:
పంచాంగం ప్రకారం.. కార్తీక అమావాస్య తిథి 24 అక్టోబర్ 2022న సాయంత్రం 5:29 గంటలకు ఆరంభం అయి 25 అక్టోబర్ 2022 సాయంత్రం 4:20 వరకు ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 24న దీపావళి పండుగను జరుపుకోనున్నారు. దీపావళి మరుసటి రోజున కార్తీక శుక్ల ప్రతిపాదంలో గోవర్ధన పూజ మరియు అన్నకూట్ పండుగ జరుపుకుంటారు.

ప్రదోష వ్రతం:
పంచాంగం ప్రకారం.. అక్టోబర్ 25న ప్రదోష ఉపవాసం కూడా ఈ రోజున పాటిస్తారు. ప్రదోష వ్రత పూజ సమయం సాయంత్రం 5.50 నుంచి రాత్రి 8.22 వరకు ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు ప్రదోష వ్రతాన్ని కూడా ఆరాధించవచ్చు.

సూతక్ కాలం:
ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. సూర్యగ్రహణం యొక్క సూతక్ కాలం..సూర్యగ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఇక సూర్యగ్రహణం ముగింపుతో సూతక్ కాలం ముగుస్తుంది.

పండుగలు ప్రభావితం కావు:
ఈసారి దీపావళి అక్టోబర్ 24న జరుపుకుంటారు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి.. దీపావళిపై ఎలాంటి ప్రభావం ఉండదు. గోవర్ధన్ పూజ కూడా సజావుగా జరుపుకోవచ్చు.

Also Read: ఇంట్లో రెండు ప్రమాదకరమైన క్రైట్ స్నేక్‌లు.. రెండింటిని ఒకేసారి పట్టాడు! నీకో దండంరా అయ్యా

Also Read: Jr Ntr Meet Amit Shah: జూనియర్ తో టీడీపీ ఖేల్ ఖతం! అమిత్ షా ప్లాన్ చెప్పిన కొడాలి నాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News