Shani Amavasya 2022: శని అమావాస్య రోజున సూర్యగ్రహణం... ఖచ్చితంగా వీటిని దానం చేయండి, అన్ని కష్టాలు తొలగిపోతాయి!

Shani Amavasya 2022: శని అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడటం అరుదైన సంఘటన. ఈ రోజున దానం చేయడం వల్ల శని అనుగ్రహం ఉంటుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 11:10 AM IST
Shani Amavasya 2022: శని అమావాస్య రోజున సూర్యగ్రహణం... ఖచ్చితంగా వీటిని దానం చేయండి, అన్ని కష్టాలు తొలగిపోతాయి!

Shani Amavasya 2022 Daan: ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం (Surya Grahan 2022) శనిశ్చరి అమావాస్య రోజున సంభవిస్తుంది. ఈ రోజు అంటే ఏప్రిల్ 30, శనివారం ఈ గ్రహణం వైశాఖ మాసం అమావాస్య రోజున మెుదలై... కృష్ణ పక్షం అమావాస్య రోజుతో ముగుస్తుంది. అనంతరం తర్వాత రోజు నుండి శుక్ల పక్షం ప్రారంభమవుతుంది. ఈ అమావాస్యకు అనేక ప్రత్యేకతలున్నాయి. శనివారం వస్తుంది కాబట్టి దీనిని శని అమావాస్య అంటారు. ఈ రోజునే సూర్యగ్రహణం ఉండటం మరో విశేషం. నిన్న (ఏప్రిల్ 29)న శని తన స్వంత రాశిచక్రం కుంభరాశిలోకి ప్రవేశించింది. కాబట్టి ఈ రోజున తప్పకుండా దానం (Shani Amavasya 2022 Daan) చేయండి. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలున్నాయి. 

శని అమావాస్య నాడు కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. శని అమావాస్య (Shani Amavasya 2022) రోజు ఉదయం నుంచి ప్రీతి యోగం ఉంది. ఇది మధ్యాహ్నం 03:20 వరకు ఉంటుంది. దీని తర్వాత ఆయుష్మాన్ యోగం ప్రారంభమవుతుంది. రాత్రి 08:13 వరకు అశ్వినీ నక్షత్రం ఉంది. మొత్తంమీద ఈ పరిస్థితి చాలా శుభపరిణామం. అందుకే ఉదయాన్నే తలస్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యం లభించడమే కాకుండా అన్ని కష్టాల నుంచి బయటపడతారు.  ఇది కాకుండా, తర్పణం, పిండ్ దాన్, శ్రాద్ చేయడం ద్వారా పితృ దోషం తొలగిపోతుంది. ఒక వేళ లేకపోయినా, ఈ రోజున ఈ పని చేయండి. దీని వల్ల మీకు ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి. 

ఈ వస్తువులను దానం చేయడం వల్ల శని సంతోషిస్తాడు
శని అమావాస్య రోజు దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడు (Lord Shani)... జీవితంలో ఆనందం, విజయం, శ్రేయస్సును ఇస్తాడు. ఈ రోజున శనికి సంబంధించిన వస్తువులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇందుకోసం పవిత్ర నదీ జలంతో ఉదయం పూట స్నానం చేయాలి. తర్వాత శని ఆలయానికి వెళ్లి పూజించండి. అతనికి నీలం పువ్వులు, నల్ల నువ్వులు, ఆవాలు నువ్వులు సమర్పించండి. దీని తరువాత, అవసరమైన వారికి నల్ల బట్టలు, నల్ల నువ్వులు, పాదరక్షలు, ఉడకబెట్టిన పప్పు, ఆవనూనె మొదలైన వాటిని దానం చేయండి.

Also Read: Surya Grahan 2022: సూర్య గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ పొరపాటు చేయకండి.. అది పుట్టబోయే పిల్లలపై పెను ప్రభావం చూపుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News