Solar Eclipse 2022: ఈ ఏడాది 2022లో తొలి సూర్య గ్రహణం వెళ్లిపోయింది. ఇప్పుడు రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ 25వ తేదీన ఉంది. ఈ ఏడాది రెండే సూర్య గ్రహణాలున్నాయి. గ్రహణం అంటే ఏంటి, గ్రహణ కాలమంటే ఏంటో చూద్దాం.
ఆధ్యాత్మిక కోణంలో సూర్య గ్రహణానిని విశేష ప్రాధాన్యత ఉంది. 2022లో మొత్తం రెండు సూర్య గ్రహణాలుండగా..ఒకటి ఇప్పటికే వెళ్లిపోయింది. మరో సూర్య గ్రహణం అక్టోబర్ 25వ తేదీన ఉంది. ఇది ఈ ఏడాదిలో రెండవ, చివరి సూర్య గ్రహణం. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమిపై నీడ, చీకటి విస్తరిస్తుంది. దీనినే సూర్య గ్రహణం అంటారు.
అక్టోబర్ 24, మంగళవారం నాడు సూర్య గ్రహణం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై...5 గంటల 42 నిమిషాల వరకూ ఉంటుంది. ఇండియాలో సూర్య గ్రహణం సంభవించదు కాబట్టి గ్రహణ కాలం కూడా లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం ఆఫ్రికా, యూరప్, మహాద్వీపపు ఉత్తర భాగంలో కన్పించనుంది. అటు ఆసియాలోని దక్షిణ భాగంలో కూడా ఈ సూర్య గ్రహణం కన్పించనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం ప్రభావం మొత్తం 12 రాశులవారి జీవితాలపై పడనుంది. వ్యక్తి జీవితం అస్తవ్యస్థమవుతుంది. ఈ సందర్భంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
ఇదొక ఖగోళ పరమైన ఘటన. ఈ ఘటన ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. అందుకే సూర్య గ్రహణం సందర్భంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణకాలంలో వండిన అన్నం తినకూడదు. అందుకే ఈ సమయంలో ఏం తినకుండా ఉండాలి. దాంతోపాటు గ్రహణం తరువాత కట్ చేసిన కూరగాయలు, లేదా తయారైన అన్నం పారేయాలి. ఆ భోజనం తింటే..రోగాలు వ్యాపిస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గర్భిణీ మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ప్రభావం కడుపులో బిడ్డపై పడే అవకాశముంది. అందుకే గ్రహణం సమయంలో ఇంట్లోంచి బయటకు రాకూడదు. గ్రహణం సమయంలో నెగెటివ్ ఎనర్జీ తిరుగుతుంటుంది. అందుకే ఏ శుభ కార్యం తలపెట్టకూడదు. మనస్సు, మస్కిష్కం రెండూ ఆరోగ్యంగా ఉంచేందుకు గ్రహణం తరువాత స్నానం చేయాలి. భగవంతుడిని పూజించాలి. సూర్య గ్రహణం సమాప్తమవగానే..ఆపన్నులకు దానం చేయాలి. ఇలా చేస్తే..ఆ వ్యక్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Also read: Mercury venus conjunction: బుధ, శుక్ర గ్రహాల కలయిక ప్రభావం..ఆ మూడు రాశులపై అమితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook