Shukra Gochar December 2022 Effects: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. ఇది మొత్తం 12 రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. సంపద, విలాసం, ప్రేమ మరియు అందానికి కారకుడు శుక్రుడు. డిసెంబరు 5న శుక్రుడు ధనుస్సు రాశిలోకి (Shukra Gochar 2022) ప్రవేశించబోతున్నాడు. డిసెంబరు 29 వరకు అదే రాశిలో ఉంటాడు. దీని తర్వాత శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries): మేషరాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. దీంతో వీరు ఆర్థికంగా లాభపడతారు. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
సింహం (Leo): శుక్రుడు రాశి మారడం వల్ల సింహ రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. వారి వైవాహిక జీవితంలో ప్రేమ మాత్రమే ఉంటుంది. కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు గౌరవిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు.
వృశ్చికం (Scorpio): శుక్రుడు వృశ్చికరాశి నుండి బయటికి వెళ్లి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వీరికి బలమైన లాభాలను ఇస్తాడు. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. గుర్తుండిపోయే కుటుంబ యాత్రకు కూడా వెళ్లవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారానికి కూడా సమయం లాభదాయకంగా ఉంటుంది.
కుంభం (Aquarius): శుక్రుని సంచారం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. రుణ సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందుతారు. పనుల్లో విజయం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Astrology: అనురాధ నక్షత్రంలో మూడు గ్రహాలు... ఈ రాశులకు ఆర్థికంగా లాభం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి