Shukra Upay: ప్రతి రోజూ శుక్ర మంత్రంతో పాటు ఈ మంత్రం జపిస్తే.. అన్ని శుభాలే..!

Shukra Upay: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక్కొ గ్రహానికి ఒక్కొ ప్రముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా 12 గృహాలు ప్రభావం 12 రాశులపై పడుతుంది. ముఖ్యంగా ఇవి వ్యక్తుల జాతకాలపై అధారపడి ఉంటాయి. దీంతో జాతకాలలో వివిధ రకాల యోగాలు ఏర్పడతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 01:59 PM IST
  • ప్రతి రోజూ శుక్ర మంత్రంతో పాటు..
  • 108 సార్లు శివ మంత్రాన్ని జపిస్తే
  • ఆర్థికంగా లాభాలు పొందుతారు
Shukra Upay: ప్రతి రోజూ శుక్ర మంత్రంతో పాటు ఈ మంత్రం జపిస్తే.. అన్ని శుభాలే..!

Shukra Upay: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక్కొ గ్రహానికి ఒక్కొ ప్రముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా 12 గృహాలు ప్రభావం 12 రాశులపై పడుతుంది. ముఖ్యంగా ఇవి వ్యక్తుల జాతకాలపై అధారపడి ఉంటాయి. దీంతో జాతకాలలో వివిధ రకాల యోగాలు ఏర్పడతాయి. అయితే యోగాల వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే వీటి వల్ల చాలా మంది తీవ్రమైన సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ యోగాలు గ్రహాల స్థితిని బట్టి మారుతాయి. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే.. వ్యక్తులు ఆర్థికంగా చాలా ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి నష్టాలు రాకుండా పలు రకాల నివారణలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే అన్ని శుభాలే:

1. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి:
గ్రహాల ప్రభావం ఉన్నవారు.. ఎలాంటి దుష్ప్రభావలకు గురి కాకుండా శుక్రవారం రోజునా శివలింగానికి పాలాభిషేకం చేసి.. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి.  అంతేకాకుండా మంత్రోచ్ఛారణ కోసం రుద్రాక్ష పూసలను ఉపయోగించాలి.

2. పాలు దానం చేయాలి:
కడు పేదరికంలో ఉన్న వారికి, దేవాలయం ముందు ఉన్న భక్తులకు పాలు దానం చేయండి.

3. వస్తువులను దానం చేయండి
శుక్రవారం రోజున వివాహిత స్త్రీలకు తేనెతో కూడిన ఆహార పదార్థాలను దానం చేయాలి. అంతేకాకుండా గాజులు, కుంకుడు, ఎరుపు చీరలను దానం చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

4. శుక్ర మంత్రం:
శుక్ర దేవుడు అన్ని గ్రహాలపై ప్రభావం చూపుతాడు. మంచి ఫలితాలను పొందడానికి తప్పకుండా శుక్ర మంత్రాన్ని జపించండం చాలా మంచిది. కావున శుక్ర మంతాన్ని తప్పకుండా పటించాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News