Shukra Mahadasha effect: ప్రతి గ్రహానికి ఒక్కో మహాదశ ఉంటుంది. సాధారణంగా సూర్యుని మహాదశ 6 సంవత్సరాలు, శని మహాదశ 19 ఏళ్లు ఉన్నట్లు.. శుక్రుడి మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. అందం, సంపద, లవ్ మరియు రొమాన్స్ కు కారకుడిగా శుక్ర గ్రహాన్ని భావిస్తారు. మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీరు రాజులా బతుకుతారు. మీకు డబ్బుకు కొదవ ఉండదు. మీ లవ్ లైఫ్ బాగుంటుంది.
జాతకంలో శుక్రుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుని మహాదశ మీకు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. మీరు పేదరికంలో కూరుకుపోతారు. లవ్ సక్సెస్ అవ్వదు. మీ దాంపత్య జీవితంలో గొడవలు తలెత్తుతాయి. మీకు ప్రతి పనిలో ఆటంకాలే ఎదురవుతాయి. అందుకే శుభఫలితాలను పొందడం కోసం శుక్రుని మహాదశ సమయంలో కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆవేంటో చూద్దాం.
Also Read: Venus transit 2023: జూలై 7న సింహరాశిలోకి శుక్రుడు.. ఈ 2 రాశులకు డబ్బే డబ్బు..
ఈ పరిహారాలు చేయండి
** శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం తెల్లవారు జామున స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.
** శుక్రుడి యెుక్క 'శున్ శుక్రే నమః' అనే బీజ మంత్రాన్ని జపించండి.
** శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి. ఆరాధనలో ఖీర్ లేదా మిఠాయిలు నైవేద్యంగా పెట్టండి. ఈ ప్రసాదాన్ని అమ్మాయిలకు పంచి పెట్టండి.
** శుక్రవారం నాడు చీమలకు పిండి, పంచదార తినిపించండి.
** శుక్రవారం నాడు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, ముత్యాలు మొదలైన తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
Also Read: Budh Ast 2023: రేపటి నుండి ఈ 3 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook