Shukra Gochar 2023: శుక్ర గ్రహం సంచార ప్రభావంతో ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం, జూలై 1 వరకు కష్టాలు తప్పవు!

Shukra Gochar 2023: శుక్ర గ్రహం సంచార ప్రభావం ఈ రాశిలవారికి జూలై 1 దాకా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 25, 2023, 04:08 PM IST
Shukra Gochar 2023: శుక్ర గ్రహం సంచార ప్రభావంతో ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం, జూలై 1 వరకు కష్టాలు తప్పవు!

Shukra Gochar 2023: శుక్ర గ్రహం మే 10 రాత్రి 7:39 గంటలకు కర్కాటక రాశిలోకి సంచారం చేసింది. ఈ గ్రహ సంచార ప్రభావం జూలై 1 వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార తీవ్ర ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా ఉండబోతోంది. ఇదే క్రమంలో కుజుడు-శుక్రుడు ఒకే రాశిలో కలిసాయి. దీంతో శుక్ర గ్రహ సంచారం మరింత ప్రభావంతంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రాశులవారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి:
సింహ రాశి:

సింహ రాశి వారికి కుజుడు, శుక్రుడి కలయిక 12వ స్థానంలో జరిగింది. కాబట్టి ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోతారు. అంతేకాకుండా ఖర్చులు పెరిగి.. ఆదాయం తగ్గే అవకాశాలు కూడా ఉన్నయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ క్రమంలో కష్టపడి పని చేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి కూడా గురవుతారు. వ్యాపారాలు చేసేవారికి తీవ్ర నష్టాలు కలుగొచ్చు. కాబట్టి ఈ క్రమంలో పెట్టబడులు పెట్టకపోవడం చాలా మంచిది. ఈ సంచార క్రమంలో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

కుంభ రాశి:
కుంభ రాశి కుజుడు-శుక్రుల కలయిక ప్రతికూల స్థానంలో జరిగింది. కాబట్టి ఈ కలయిక కారణంగా కుంభ రాశివారు తీవ్రంగా నష్టపోయే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు సహోద్యోగుల కారణంగా అవమానాన్ని ఎదుర్కొంటారు. ప్రభుత్వం రంగంలో పని చేసేవారికి కూడా ఆటంకాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు పెట్టుబడులు పెడితే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి జూలై 1 వరకు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. 

ధనుస్సు రాశి:
శుక్ర గ్రహ సంచారం కారణంగా ధనుస్సు రాశి కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వైవాహిక జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News