Shukra Gochar 2023 in Singh: లవ్, రొమాన్స్, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇవాళ అంటే జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే రాశిలో ఆగస్టు 07 వరకు ఉంటాడు. సూర్యుడి రాశి అయిన సింహరాశిలో శుక్రుడు సంచారం ముఖ్యంగా మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
శుక్ర సంచారం ఈ 3 రాశులకు వరం
వృషభం: వృషభ రాశికి అధిపతి శుక్రుడు. సింహరాశిలో శుక్రుడు సంచారం మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం తోడవుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు కొత్త వనరులు ద్వారా డబ్బు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. మీకు మంచి లైఫ్ పార్టనర్ దొరుకుతుంది.
కర్కాటకం: శుక్రుని సంచారం కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు కొత్త జాబ్ వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
Also Read: Rahu Gochar 2023: అక్టోబరు నెల వరకు ఈ 4 రాశులకు మంచి కెరీర్, లగ్జరీ లైప్.. మీరున్నారా?
కన్య: శుక్రుని రాశి మార్పు కన్యారాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. విదేశాల నుండి ప్రయోజనం పొందుతారు. మీ వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.
Also Read: Mars Transit 2023: కుజుడు సంచారంతో లగ్జరీ జీవితాలను గడపబోతున్న రాశుల వారు వీరే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook