Shukra Gochar 2023: ఈ రాశువారికి ఆర్థిక సమస్యలన్నీ దూరం..ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!

Shukra Rashi Parivartan 2023: శుక్రుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2023, 09:30 AM IST
Shukra Gochar 2023: ఈ రాశువారికి ఆర్థిక సమస్యలన్నీ దూరం..ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!

Shukra Rashi Parivartan 2023: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని వైభవం, ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. ఆగస్టు 18న శుక్రుడు కర్కాటకంలో తిరోగమనం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడింది. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆనందం, ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశులవారికి కోరికున్న కోరికలు కూడా నెరవేరుతాయట. అయితే శుక్రుడి తిరోగమనం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మిథునరాశి:

శుక్రుడి ప్రభావం కారణంగా మిథునరాశికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి వస్తువలనైన ఇతరల నుంచి బహుమతులుగా పొందుతారు. అంతేకాకుండా లక్ష్మిదేవి అనుగ్రహం లభించి ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నుంచి మీరు ఎక్కువగా శ్రమపడన్నక్కర్లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ శుక్రుడి ప్రభావం కారణంగా జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. 

తుల రాశి:
శుక్ర గ్రహం తుల రాశికి అధిపతిగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుక్రుడి తిరోగమనం కారణంగా ఈ రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా భారీగా లాభాలు పొందే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకముందు ఇతరుల వద్ద చిక్కుకపోయిన డబ్బు కూడా సులభంగా తిరిగి వస్తుంది. వీరికి ఈ క్రమంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. 

ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు

ధనుస్సు రాశి:
శుక్ర గ్రహం సంచారం కారణంగా ధనుస్సు రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయం పెరగడం కారణంగా కొత్త కొత్త వస్తులను కూడా కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు శుభవార్తలు వింటారు. దీంతో పాటు వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తొలగిపోతాయి.

ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News