Shukra Gochar 2022: శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి ఊహించని డబ్బే.. డబ్బు..లక్కే..లక్కు..

Shukra Gochar 2022: గ్రహాలు సంచారం చేయడం వల్ల అన్ని రాశువారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మనుషుల జీవితంలో కూడా చాలా మార్పలు చేర్పులు కూడా జరుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 03:01 PM IST
  • ధనుస్సు రాశిలోకి శుక్రు గ్రహం సంచారం..
  • 4 రాశువారు ఊహించని డబ్బు పొందుతారు.
  • అంతేకాకుండా లక్కు పొందుతారు.
Shukra Gochar 2022: శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి ఊహించని డబ్బే.. డబ్బు..లక్కే..లక్కు..

Shukra Gochar 2022: ఒక గ్రహం రాశి సంచారం చేసిప్పుడల్లా చాలా రకాల రాశుల్లో మార్పులు సంభవించి జీవితాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ముఖ్యమైన గ్రహాలు సంచారం చేస్తే 12 రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచార ప్రభావం పలు రాశులపై పడే అవకాశాలున్నాయి. ఈ సంచారం డిసెంబర్ 5న సాయంత్రం 6:07 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రభావంతో అన్ని రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావంతో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశుల వారి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి:
 కుంభ రాశి:

శుక్రుడు కుంభరాశిలోని లగ్న గృహంలో సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో నిలిచిపోయిన పనులన్నీ సులభంగా జరుగుతాయి. ముఖ్యంగా కుంభ రాశి వారికి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారి ఆదాయం పెరిగడమేకాకుండా ఖర్చులన్నీ తగ్గుతాయి. అన్ని పనుల్లో వీరు విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి.

వృశ్చికరాశి:
శుక్రుడు వృశ్చిక రాశివారికి రెండవ స్థానంలో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ సంచారం వల్ల జీవితంలో ఆనందం, సమృద్ధి, సంపద నెలకొంటాయి. అంతేకాకుండా వృశ్చికరాశి వారు ఈ క్రమంలో విదేశి ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. వీరికి కుటుంబంతో గడపడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల పరంగా పదోన్నతులు పొందుతారు. ఈ సంచారం క్రమంలో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు పొందుతారు.

సింహరాశి:
సింహరాశి వారికి శుక్రుడు ఐదవ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి వైవాహిక జీవితం సంతోషాలు లభిస్తాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు సులభంగా పొందుతారు. వ్యాపారాల పరంగా మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్ పొందే ఛాన్స్‌ కూడా ఉంది.

మేషరాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మేషరాశి వారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఆనందం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారు అధికంగా లాభాలు పొందుతారు.

Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్‌ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్‌ వీడియో..

Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News