Shri Krishna Janmashtami 2022: కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు ఈ వస్తువులు తప్పనిసరి!

Janmashtami 2022: జన్మాష్టమి నాడు చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. కాబట్టి పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కృష్ణుడి ఆరాధనలో కొన్ని వస్తువులు ఖచ్చింగా ఉండాలి. లేకపోతే పూజ అంసపూర్ణంగా ఉంటుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2022, 04:05 PM IST
Shri Krishna Janmashtami 2022: కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు ఈ వస్తువులు తప్పనిసరి!

Shri Krishna Janmashtami Puja: హిందువులు  శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు.  శ్రీ కృష్ణ భగవానుడు (Lord Krishna) భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి మరియు రోహిణి నక్షత్రంలో జన్మించాడు, అందుకే దీనిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. గుజరాతీలు శ్రీకృష్ణ జన్మాష్టమిని (Shri Krishna Janmashtami 2022) శ్రీజగదాష్టమి అని అంటారు. అక్కడ నాలుగు రోజుల ముందు నుంచే ఈ పండుగ హడావుడి మెుదలవుతుంది. యాదవులకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. ఈ రోజున భక్తులు చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. 

ఈ సారి కృష్ణాష్టమి ఆగస్టు 18, 2022, గురువారం నాడు వస్తుంది.  ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారు ఈ వ్రతాన్ని  పాటించడం వల్ల ప్రయోజనం  పొందుతారు. అంతేకాకుండా సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. శ్రీకృష్ణుడిని  పూజించే సమయంలో చిన్నికృష్ణుడితో కొన్ని వస్తువులను తప్పనిసరగా ఉంచాలని శాస్త్రం చెబుతోంది. ఇవి లేకపోతే పూజ సంపూర్ణం కాదు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం. 

ఈ వస్తువులను పూజలో తప్పనిసరిగా ఉంచండి
>> శ్రీ కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వస్తువులలో వేణువు ఒకటి. అందువల్ల దానిని పూజలో ఉంచండి. వేణువు సరళత మరియు మాధుర్యానికి చిహ్నం.
>> పూజ సమయంలో కృష్ణుడి విగ్రహంతో పాటు ఆవు విగ్రహాన్ని కూడా ఉంచండి. ఎందుకంటే హిందూ మతంలో ఆవును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవులో 33 వేల దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు.
>> శ్రీకృష్ణుడికి భోగాన్ని సమర్పించేటప్పుడు తులసిని తప్పకుండా వేయండి. 
>> నెమలి ఫించం లేకుండా శ్రీ కృష్ణుని అలంకరణ సంపూర్ణం కాదు. కాబట్టి కృష్ణుడి విగ్రహానికి నెమలి పించం పెట్టండి.  
>> జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. కాబట్టి పూజలో ఒక ఊయల ఉంచండి.  

>> పూజా సమయంలో శ్రీ కృష్ణుడికి వైజయంతీ మాలను వేయడం మర్చిపోవద్దు. వైజయంతీ మాలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
>> శ్రీ కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి గంటను కూడా ఉంచండి. ఎందుకంటే దాని ధ్వని ప్రతికూలతను తొలగిస్తుంది.
>> జన్మాష్టమి రోజున ఇంట్లో రాధా-కృష్ణుల ఫోటో ఉంచండి. ఇలా చేయడం వల్ల ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి.
>> జన్మాష్టమి రోజున పూజా చేసే స్థలంలో గవ్వలు ఉంచండి. దీని వలన సంపదలు చేకూరుతాయి.

Also Read: Hariyali Amavasya 2022: హరియాళీ అమావాస్య నాడు ఈ మొక్కలు నాటితే... మీ ఇంట కనకవర్షమే.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News