Shiv Yog Astrology 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు వచ్చిన మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది. చంద్రుడు శుక్రవారం కుంభరాశిలోకి సంచారం చేయగా.. శని సూర్య గ్రహాలు అదే రాశులు సంచార క్రమంలో ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ జాతకాల్లో శుభస్థానంలో ఉన్నవారికి ఈ మహాశివరాత్రి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ రోజే శివపార్వతులు వివాహం చేసుకొని ఒకటయ్యారని పురాణాల్లో పేర్కొన్నారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన రోజున అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు శివయోగం సిద్ధయోగంతో పాటు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ఈ రాజయోగాల ప్రభావం అన్ని రాశుల వారిపై పడి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి సంపాదనలో మార్పులు రావడమే కాకుండా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ సమయం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై శివుడి అనుగ్రహం:
మిథున రాశి:
మిథున రాశి వారికి శివయోగం వల్ల ఈ రోజు నుంచి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు కూడా పొందుతారు. దీంతో పాటు ఊహించని సంపదను కూడా పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలిపారు. దీంతో పాటు కుటుంబంలో ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు. అన్ని పనుల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కన్యా రాశి:
కన్యారాశి వారికి ఈ శివయోగం జీవితంలో అన్ని కష్టాలను తొలగించబోతోంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఇతరుల నుంచి డబ్బు కూడా పొందుతారు. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కుంభ రాశి:
శని గ్రహమైన కుంభ రాశివారికి కూడా ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే అన్ని కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో అనేక ప్రయోజనాలు పొందుతారు. అలాగే కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి