Shirdi Sai Baba vachans - Ekadasha sutramulu : షిర్డీ సాయిబాబా అనుగ్రహం కోసం సాయి ఏకాదశ సూత్రములు

Shirdi Sai Baba ekadasha sutramulu, Shirdi Sai Baba vachans : సాయిబాబాను పూజించే భక్తులకు అని మాత్రమే కాకుండా దైవ భక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ గురువారం అంటే ముందుగా వాళ్ల మనసులో మెదిలే దైవం ఆ షిర్డీలో కొలువైన సాయిబాబానే. గురువారం నాడు ఆ షిర్డీ సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే (Sai Baba puja on thursday).. తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 09:23 AM IST
  • షిర్డీ సాయిబాబాకు ప్రీతికరమైన ఏకాదశ సూత్రములు
  • సాయినాథుడి అనుగ్రహం పొందేందుకు పఠించాల్సిన ఏకాదశ సుత్రాలు
  • షిర్డీ సాయినాథుడు భక్తుల నుంచి ఏం కోరుకుంటాడో తెలిపే 11 సూత్రాలు
Shirdi Sai Baba vachans - Ekadasha sutramulu : షిర్డీ సాయిబాబా అనుగ్రహం కోసం సాయి ఏకాదశ సూత్రములు

Shirdi Sai Baba ekadasha sutramulu: షిర్డీ సాయి బాబాకు గురువారం ఎంత ప్రత్యేకమైనదో ఆ సాయినాథుడి భక్తులకు అందరికీ తెలిసిందే. సాయిబాబాను పూజించే భక్తులకు అని మాత్రమే కాకుండా దైవ భక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ గురువారం అంటే ముందుగా వాళ్ల మనసులో మెదిలే దైవం ఆ షిర్డీలో కొలువైన సాయిబాబానే. గురువారం నాడు ఆ షిర్డీ సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే (Sai Baba puja on thursday).. తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. 

గురువారం సాయిబాబాను పూజించే సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో సాయిబాబా ఏకాదశ సూత్రములను పఠిస్తే.. మనస్సుకు ప్రశాంతత చేకూరడంతో పాటు ఆ దేవుడి ఆశిస్తులు పొందవచ్చని గ్రంధాలు చెబుతున్నాయి.

Also read : Shirdi Sai Baba madhyana aarati lyrics in Telugu: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

Shirdi Sai Baba vachans, ekadasha sutramulu : సాయిబాబా ఏకాదశ సూత్రములు

1) షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
2) ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
3) ఈ భౌతిక దేహానంతరము సైతం నేనప్రమత్తుడను.
4) నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడును.
5) నా సమాదినుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.
6) నా సమాధినుండియే నా మానుష్య శరీరము మాట్లాడును.
7) నన్నాశ్రయించిన వారిని, నన్ను శరణు జొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యము.
8) నాయందెవరికి ద్రుష్టిగలదో వారి యందే నా కటాక్షము గలదు.
9) మీ భారములను నాపై బడవేయుడు. నేను మోసెదను.
10) నా సహాయమును కానీ, నా సలహానుగాని, కోరిన తక్షణమే మొసంగ సంసిద్ధుడను.
11) నా భక్తుల ఇంట 'లేమి' అను శబ్దము పొడచూపదు.

Also read : Pancha Brahma Lingeshwara Temple : దేశంలో ఏకైక పంచ బ్రహ్మలింగేశ్వర ఆలయం విశిష్టత

Sai baba ekadasha sutramulu - అత్యంత భక్తి శ్రద్ధలతో సాయిబాబా ఏకాదశ సూత్రములు పఠించడం వల్ల ఆ సాయి బాబా దృష్టి భక్తులపైపడి ఆయన కరుణ, కటాక్షాలు లభిస్తాయనేది భక్తుల నమ్మకం. సాయి బాబా పూజా విధానం (Sai Baba puja vidhanam)

Also read : Diwali Sentiments: దీపావళి రాత్రి ఆ పక్షి లేదా జంతువుని చూస్తే ఏమవుతుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News