Shani Gochar 2024: ఈ రాశులవారికి 2025 వరకు శని దేవుడి అనుగ్రహం..ఏం చేసిన ధన లాభాలే..

Shani Gochar 2024: కీడు గ్రహంగా పరిగణించే శని 2025లో రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2024, 01:15 PM IST
Shani Gochar 2024: ఈ రాశులవారికి 2025 వరకు శని దేవుడి అనుగ్రహం..ఏం చేసిన ధన లాభాలే..

 

Shani Gochar 2024: జ్యోతిష్య శాస్త్రంలో కీడు గ్రహంగా పరిగణించే శని నెమ్మదిగా సంచారం చేస్తుంది. ఈ గ్రహం కనీసం రెండున్నర సంవత్సరాలు రాశిలో సంచార దశలో ఉంటుంది. జాతకంలో ఈ గ్రహం ప్రత్యేకమైన శుభ స్థానంలో ఉంటే జీవితంలో సమస్యలన్నీ దూరమవుతాయి. అదే ఈ శని గ్రహం జాతకంలో అశుభ స్థానంలో ఉంటే రెండున్నర సంవత్సరాల పాటు కూడా తీవ్ర దుష్ప్రభావాల బారిన జీవించాల్సి ఉంటుంది. శని గ్రహం 30 సంవత్సరాల తర్వాత శని సొంత రాశి కుంభరాశిలో సంచార దశలో ఉన్నాడు. అంతేకాకుండా ఈ 2024 సంవత్సరంలో శని గ్రహం కదలికల్లో మార్పులు కూడా చేయబోతోంది. ఈ గ్రహం 2025 జనవరి నెల వరకు అదే రాశిలో ఉంటాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత ఇతర రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

మేషరాశి:
2024 సంవత్సరంలో జరిగే శని కదలికల కారణంగా మేష రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మిగిలిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారి కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఇంట్లో కూడా ఆనంద వాతావరణం నెలకొంటుంది.  

కన్యా రాశి:
కన్యా రాశి వారికి శని గ్రహ కదలికల కారణంగా అనేక రకాల మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో  అదృష్టవంతులవుతారు. దీని కారణంగా ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా శని దేవుడి అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. వ్యాపారాల్లో కూడా ఈ సంవత్సరంలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుంగా డబ్బుతో పాటు సంపాదనకు కూడా ఎలాంటి లోటు ఉందడని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయాల్లో ఏదైనా పనులు చేసే క్రమంలో తొందర పడకపోవడం చాలా మంచిది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

వృశ్చికరాశి:
ప్రస్తుతం వృశ్చిక రాశివారికి ఐదవ స్థానంలో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఊహించని డబ్బు పొందుతారు. అంతేకాకుండా మీ భాగస్వామితో కొనసాగుతున్న వివాదాలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు కృషి దగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల కంటే మంచి ఆఫర్స్‌ కూడా పొందుతారు. దీంతో పాటు కొత్త అవకాశాలు కూడా పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడం వల్ల లాభాలు కూడా పొందుతారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News