Shani effect on life: శని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎన్ని మార్పులో..

Shani effect on life: జ్యోతిష్య శాస్త్రంలో శనికి ఉండే ప్రాధాన్యత చాలా ప్రత్యేకం. శని అనుగ్రహంకోసం ప్రత్యేక పూజలు చేయడం కూడా చూస్తుంటాం. ఒకవేళ శని అనుగ్రహిస్తే జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకుందామా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 08:40 PM IST
  • శని అనుగ్రహం లభించాలంటే ఏం చేయాలి
  • ఎవరిపై శని ప్రభావం సానుకూలంగా ఉంటుంది
  • శని ప్రభావం ఎప్పుడు ఎప్పుడు మారుతుంది?
Shani effect on life: శని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎన్ని మార్పులో..

Shani effect on life: శని.. ఆ మాట వినగానే చాలా మంది భయానికి గురవుతుంటారు. ఆ మాట పలికేందుకే చాలా మంది ఇష్టపడరు. జీవితంపై శని దేవుడి కన్ను పడితే తీవ్ర కష్టాలు పడాల్సి వస్తుందని భావిస్తుంటారు. అయితే.. శని దేవుడి అనుగ్రహం లభిస్తే మంచి జరుగుతుంది. శని దేవుడు సైతం వరాలు ఇస్తాడనిమ్ముతారు చాలా మంది. గ్రహాల కదలికలు తమ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని, సరైన స్థానంలో శని గనక ఉంటే మంచి జీవితం మీ సొంతమవుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.

మనం చేసే పనులు మంచివయితే.. శని సరైన స్థానంలో లేకపోయినా సమస్యల సుడిగుండంలో చిక్కుకోమని చెబుతున్నారు. మనం చేసే పనుల బట్టే శని ప్రభావం ఉంటుంది. మన పనులు చెడుగా ఉంటే గ్రహాల అనుగ్రహం ఉన్నా.. సమస్యలు తప్పవు. మన గ్రహఫలాల్లో శని సరైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తిపై ప్రభావం సైతం సానుకూలంగానే ఉంటుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు జరుగుతాయి.  జోతిష్యులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు సైతం అదే చెబుతుంటారు. అలాగే.. వారు అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తయి.. సత్ఫలితాలను సాధిస్తారని అంటుంటారు. 

ఒక వ్యక్తి జీవితంపై శని ప్రభావం సానుకూలంగా ఉంటే.. ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి. శని అనుగ్రహంతో ఎలాంటి జీవితం లభిస్తుందని అనేది ఓసారి గమనిద్దాం. 

పురోగతి.. 

ఒక వ్యక్తికి సంబంధించి గ్రహాల కదలికలు అతని జీవితంలో మంచిగానో.. లేదా చెడుగానో ప్రభావం చూపుతాయనేది నమ్ముతాం. గ్రహాల కదలికల్లో శని సరైన స్థానంలో ఉంటే అతని జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. జీవితంలో తొందరగా విజయం సాధిస్తాడు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాడు. జోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలను ఆధారంగా చేసుకునే ఒక వ్యక్తి భవిష్యత్తును నిర్ధరిస్తుంటారు. గ్రహాల అనుగ్రహం ఉంటే వారి జీవితం సుఖమయమవుతుందని జోతిష్యులు, ఆధ్యాత్మిక గురువులు చెబుతుంటారు.

సంతోషం వెల్లివిరుస్తుంది..

తమ గ్రహాల కదలికల్లో శని సరైన స్థానంలో ఉన్నట్లయితే.. మంచి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం. అలాంటి వారి జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వారు కార్లు, బంగ్లాలు, సంపదతో తులతూగుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి కష్టాలు లేకుండా  కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. అనారోగ్యం వారి ధరి చేరదు. ఎలాంటి చీకూచింత లేకుండా సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తారు.

గౌరవం..

గ్రహఫలాల్లో శని మంచి స్థానంలో ఉన్నట్లయితే.. జీవితం సంతోషమయం కావటమే కాకుండా వారికి అన్నింట గౌరవం దక్కుతుంది. శని ప్రభావం సానుకూలంగా ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉంటాడు. కష్టపడి పనిచేసే తత్వం అతనిలో ఉంటుంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాడు. అందరిని కలుపుకుంటూ ముందుకు సాగుతాడు. చెడు చేయడు, చేసే వారిని క్షమించడు. ఈ లక్షణాలతో సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతాడు. నలుగురిలో హుందాగా జీవిస్తాడు.

శని అనుగ్రహం పొందటం ఎలా..

శని సరైన స్థానంలో ఉంటే మంచి జీవితం లభిస్తుందని తెలుసు. అయితే శని అనుగ్రహం పొందటం ఎలా. ఎలాంటి పనులు చేయాలి.

శని దేవుడు మనం చేసే పనులను బట్టే మనకు ఫలితాలను ఇస్తుంటాడు. అందుకే శని దేవుడికి నచ్చిన పనులనే చేయాలి. అలా చేయటం ద్వారా అనుగ్రహం పొంది మంచి జీవితాన్ని పొందొచ్చు.

ఉదాహరణకు పేద ప్రజలు, నిరాశ్రయులకు సాయం చేయటం, ప్రతి విషయంలో నిజాయితీగా ఉండటం, ఆల్కాహాల్‌కు దూరంగా ఉండటం, చెడు మాట్లాడకపోవటం వంటివి చేయాలి.

మన పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం ఏంటంటే ఆంజనేయుడిని పూజిస్తే.. శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే.. రావి చెట్టుకు శనివారం రోజు పూజ చేయటం, నీరు అందించటం, శని దేవుడిపై నూనే పోయటం వంటివి చేయాలి. శని దేవుడికి నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు సమర్పిస్తే అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు  చెబుతుంటారు.

జీవితంలో ఉన్నతంగా ఉండాలంటే గ్రహాల అనుగ్రహంతో పాటు మనం చేసే పనులు, నడవడిక సరైన మార్గంలో ఉన్నప్పుడే సత్ఫలితాలు వస్తాయి. జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.

నోట్​: ఈ కథనంలోని అంశాలు జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇందులో పెర్కొన్న విషయాలను ZEE తెలుగు NEWS ధృవీకరించలేదు.

Also read: Zodiac signs Nature: ఈ రాశుల పిల్లలకు సాధ్యం కానిదంటూ ఉండదట తెలుసా

Also read: Saturn Transit 2022: కుంభ రాశిలోకి శని సంచారం... ఈ 3 రాశుల వారికి పట్టిన శని పీడ ఇక వదిలినట్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News