Shani Dev: శని గ్రహం త్వరలోనే నక్షత్ర సంచారం..ఈ రాశులవారికి 4 నెలలు లాభాలే లాభాలు!

Shani Dev: శని గ్రహం త్వరలోనే నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నక్షత్ర సంచారం అన్ని రాశులవారిపై దాదాపు 4 నెలల పాటు ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 06:41 AM IST
Shani Dev: శని గ్రహం త్వరలోనే నక్షత్ర సంచారం..ఈ రాశులవారికి 4 నెలలు లాభాలే లాభాలు!

 

Transiting Saturn In Shatabhisha Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజగో భావిస్తారు అంతేకాకుండా ఈ గ్రహానికి పాప గ్రహం, అశుభగ్రహంగా కూడా పేరు ఉంది. వ్యక్తుల జాతకాలలో శని గ్రహం ఆ శుభ స్థానాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితాలలో అనేక రకాల సమస్యలు వస్తాయి అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం శని గ్రహం శతభిషా నక్షత్రంలో సంచార దశలో ఉంది. మూడు నెలల తర్వాత పూర్వభద్రపాద నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఇలా నక్షత్ర సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఊహించని లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

మేష రాశి:
శని నక్షత్ర సంచారం కారణంగా మేష రాశి వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా బాధపడుతున్న వారికి శని దేవుడి అనుగ్రహం లభించి.. ఊహించని లాభాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి పురోగతి లభిస్తుంది. వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా గడుస్తుంది. మేష రాశి వారు ఈ సమయంలో కొత్త వాహనాలు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎప్పటినుంచో విజయాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని అనుగ్రహం లభించి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అదృష్టం రెట్టింపు అవడం కారణంగా వైవాహిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించి.. అన్ని పనుల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. సమాజంలో వీరికి గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో అనుకోకుండా పదవులు, ప్రతిష్టలు కూడా లభిస్తాయి.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

కన్య రాశి:
కన్య రాశివారికి రాబోయే 4 నెలలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంతకముందు వినని శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వైవాహిక జీవితంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ రాశివారు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనే ఛాన్స్‌ ఉంది. 

ధనస్సు రాశి:
ఈ సమయంలో ధనస్సు రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వైవాహిక జీవితంలో భాగస్వామితో ప్రేమగా ఉంటారు. ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలో ప్రశంసలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగంలో కొత్త పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News