Shani Dev: కుంభరాశిలో శని కదలికలు.. ఈ రాశుల వారికి ఫిబ్రవరి 11 నుంచి పట్టిందల్లా బంగారం కాబోతోంది..

Shani Dev Effect: ఫిబ్రవరి 11న కుంభరాశిలో శని కదలికల కారణంగా కొన్ని రాశుల వారికి జీవితంలో ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే ఈ కదలికల ప్రభావం ఏయే రాశుల వారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2024, 05:22 PM IST
Shani Dev: కుంభరాశిలో శని కదలికలు.. ఈ రాశుల వారికి ఫిబ్రవరి 11 నుంచి పట్టిందల్లా బంగారం కాబోతోంది..

Shani Dev Effect: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం ఎంతో ముఖ్యమైనది. ఈ గ్రహానికి కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కీడు గ్రహంగా కూడా పరిగణిస్తారు. అయితే శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శని గ్రహం సంచారం చేయడం కారణంగా కూడా జాతకాల్లో ఉన్న స్థానాలను బట్టి కర్మ ఫలితాలు ఏర్పడతాయి. శని గ్రహం గ్రహాలు మారినప్పుడు తిరోగమనం చేసినప్పుడు ఎంతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడుతుంది. దీని కారణంగా అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి 11న శని గ్రహ కదలికల్లో మార్పులు రాబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, మరికొన్ని రాశుల వారికి అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

మేషరాశి:
ఫిబ్రవరి 11న జరిగే శని గ్రహ కదలికల కారణంగా మేష రాశి వారికి మిశ్రమ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా జీవితంలో ఎదురవుతూ వస్తున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా లాభపడతారు రాబోయే 36 రోజులపాటు మేషరాశి వారు వ్యాపారాలు, వృత్తిలో విపరీతమైన ఆర్థిక లాభాలు పొందుతారు. కాబట్టి ఈ సమయంలో కొంత కష్టపడి పని చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడే అవకాశాలున్నాయి.

మిథున రాశి:
శని గ్రహ కదలికల ప్రభావం మిధున రాశి వారిపై కూడా సమానంగా పడబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఖర్చులు తగ్గి కొంతవరకు డబ్బులు సేవ్ అవుతాయి. దీంతోపాటు కెరీర్ పరంగా వీరికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇంతకుముందు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కర్కాటక రాశి:
శని గ్రహ ప్రభావం శని గ్రహ ప్రభావం కర్కాటక రాశి వారిపై కూడా పడబోతోంది. దీనికి కారణంగా వీరు ఇంతకుముందు పొందలేని లాభాలన్నీ పొందుతారు. దీంతోపాటు ఈ సమయం వీరికి చాలా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి సంపాదన పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడతారు. ఇక మీపై మీకు విశ్వాసం పెరిగి.. ఈ సమయంలో ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News