Shani Amavasya 2022: ఆగస్టు 27 అంటే ఇవాళే శని అమావాస్య. భాద్రపదంలోని శనీచర అమావాస్య నాడు ఏకంగా 14 ఏళ్ల తరువాత అరుదైన సంయోగం ఏర్పడనుంది. ఆ సంయోగం ప్రభావం గురించి తెలుసుకుందాం..
హిందూమతంలో అమావాస్య తిధికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఈ రోజున స్నానాది కార్యక్రమాలు, దానాలు, పిండదానం, తర్పణం వంటివి నిర్వహిస్తారు. కానీ ఒకవేళ అమావాస్య అనేది శనివారం నాడు వస్తే..ఆ మహత్యం మరింత పెరుగుతుంది. శని అమావాస్యరోజున శనిదేవుడి పూజ చేయాల్సి ఉంటుంది. ఈసారి శని అమావాస్య ఏకంగా 14 ఏళ్ల తరువాత అరుదైన సంయోగం ఏర్పరుస్తుంది. ఈరోజున కొన్ని పద్ధతులు పాటిస్తే..శనిదేవుడి కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తికి శనిపీడ విరగడౌతుంది.
ఇవాళ్టి రోజున పూర్వీకుకు పిండ ప్రదాన పూజలు చేయడం వల్ల మేలు చేకూరుతుంది. ఈసారి శని అమావాస్య 14 ఏళ్ల తరువాత అద్భుతమైన, అరుదైన సంయోగాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక సంయోగంలో చేసిన పూజకు పలు రెట్లు లాభాలుంటాయి. ఏ అరుదైన సంయోగంలో శని అమావాస్య జరుపుకుంటారో తెలుసుకుందాం..
హిందూ పంచాంగం ప్రకారం 14 ఏళ్ల తరువాత శని భాద్రపద అమావాస్య నాడు ప్రత్యేకంగా అరుదైన సంయోగాన్ని ఏర్పాటు చేస్తోంది. శనీచర అమావాస్య కుండలిలో శని సంబంధిత దోషాలున్నవాళ్లు, శనిదేవుడి కటాక్షం కోసం అనువైన సమయంగా భావిస్తారు. ఆగస్టు 27న శని అమావాస్రోజు శివయోగం, సిద్ధ యోగం ఏర్పడుతున్నాయి.
జ్యోతిష్య పండితుల ప్రకారం భాద్రపద మాసంలో శని అమావాస్య రావడం అరుదైన సంయోగం. 14 ఏళ్ల తరువాత భాద్రపదమాసంలో శని అమావాస్య వచ్చింది. శని అమావాస్ నాడు 4 పెద్ద గ్రహాలు తమ రాశిలో ఉంటాయి. ఇవాళ సూర్యుడు సింహరాశిలో, బుధుడు కన్యారాశిలో, గురుడు మీనరాశిలో, శని మకరంలో ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం కీలకమైన పెద్ద గ్రహాలు తమ రాశుల్లో ఉంటే అత్యంత శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఇవాళ చాలా ప్రత్యేకమైంది.
శని అమావాస్య నాడు శనిదేవుడి కటాక్షం, పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు పూజలు చేస్తారు. ఇవాళ ధనస్సు, మకరం, కుంభ రాశులపై శని నీడ ప్రసరిస్తుండగా..మిధునం, తుల రాశులపై శనిపీడ ఉంది. శనిపూజ చేయడం ద్వారా ప్రత్యేక ఫలాలు పొందవచ్చు.
Also read: Vinayaka Chavithi 2022: వినాయక చవితి ఎప్పుడు, విశిష్టత, పూజా విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook