Planet Transits 2022: సెప్టెంబరులో 3 ప్రధాన గ్రహాల సంచారం... ఈ రాశులకు అంతా నష్టమే..!

Planet Transits 2022: సెప్టెంబర్ నెలలో ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. వీటి సంచారం కొన్ని  రాశులకు ప్రతికూలంగా మారనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2022, 12:05 PM IST
Planet Transits 2022: సెప్టెంబరులో 3 ప్రధాన గ్రహాల సంచారం... ఈ రాశులకు అంతా నష్టమే..!

Planet Transits in September 2022: సెప్టెంబర్ మాసంలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలున్నాయి. ప్రధాన గ్రహాలైన బుధుడు, శుక్రుడు, సూర్యుడు తమ రాశిని మార్చనున్నాయి. అంతేకాకుండా ఈ నెలలో మెర్య్కూరీ గ్రహం తిరోగమనంలో ఉంటుంది మరియు శుక్ర గ్రహం అస్తమిస్తుంది. గ్రహాల రాశి మార్పు మెుత్తం 12 రాశుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఈ గ్రహాల స్థానంలో మార్పు కొన్ని రాశులవారికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. సెప్టెంబరులోని ఈ గ్రహాల సంచారం కొన్ని  రాశులవారికి ఇబ్బందులు తెస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

ఈ రాశులవారు జాగ్రత్త
సింహం (Leo): ఈ రాశివారికి ఈ సమయం అంతగా కలిసి రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. వ్యాపారస్తులు భారీగా నష్టాలు చవిచూస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.
తుల (Libra): ఈ రాశివారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో పెద్దగా  లాభాలు ఉండవు. వైవాహిక జీవితంలో సమస్యలు  తలెత్తుతాయి. అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. 
వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆర్థిక, ఆరోగ్య పరంగా సమస్యలు ఎదురుకావచ్చు.  ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. 
మకరం (Capricorn): సెప్టెంబర్ నెలలో మకర రాశి వారు తమ కెరీర్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో వ్యాపారవేత్తలు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. ఆరోగ్యం చెడుపోయే అవకాశం ఉంది.  
ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. విద్యార్థుల కష్టపడి చదవాలి. ఈ రాశివారికి కెరీర్ లో తీవ్ర ఇబ్బందులు ఉండవచ్చు. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: Vinayaka Chavithi: వినాయకుడిని ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News