Second Surya Grahan 2023 Date: 2023లో రెండో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు ఎక్కువ ప్రభావితులవుతారు!

These 4 zodiac signs will loss money due to Second Surya Grahan 2023. ఈ ఏడాది రెండవ మరియు చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14న (శనివారం) నాడు ఏర్పడనుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : May 28, 2023, 07:32 PM IST
Second Surya Grahan 2023 Date: 2023లో రెండో  సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు ఎక్కువ ప్రభావితులవుతారు!

These 4 zodiac signs will loss money due to Second Surya Grahan 2023: సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణం ఒక అద్భుతమైన ఖగోళ దృగ్విషయం. వీటికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే సూర్యు గ్రహణం మరియు చంద్ర గ్రహణంలు హిందూ మతం మరియు జ్యోతిషశాస్త్రంలో చెడుగా భావిస్తారు. గ్రహణం కారణంగా వాతావరణంలో ప్రతికూలత పెరుగుతుందని, అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదని జనాలు నమ్ముతారు. 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడతాయి. ఇందులో ఓ సూర్య గ్రహణం మరియు ఓ చంద్ర గ్రహణం ఇప్పటికే సంభవించాయి. ఒక సూర్య గ్రహణం మరియు ఒక చంద్ర గ్రహణం ఇంకా జరగలేదు. అక్టోబర్ నెలలో ఈ సంవత్సరంలో రెండవ సూర్య గ్రహణం సంభవించబోతోంది.

ఈ ఏడాది రెండవ మరియు చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14న (శనివారం) నాడు ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం కంకణాకార సూర్య గ్రహణం అవుతుంది. అంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచలేడు. ఈ సమయంలో సూర్యుడు అగ్ని వలయంలా కనిపిస్తాడు. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం వలె.. రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లదు. కానీ ఈ సూర్య గ్రహణం కొన్ని రాశుల వ్యక్తులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. 

మేషం:
2023 అక్టోబర్‌లో జరగబోయే తదుపరి సూర్య గ్రహణం మేష రాశి వారికి అశుభంగా ఉండనుంది. సన్నిహితులు కూడా మోసం చేయగలరు. ఉద్యోగంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.

వృషభం:
2023 సంవత్సరంలో రెండవ సూర్య గ్రహణం వలన వృషభ రాశి వారికి ధన నష్టం కలుగుతుంది. పనిలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. మాటల విషయంలో సంయమనం పాటించండి.

కన్యా రాశి:
2023 సంవత్సరంలో వచ్చే చివరి సూర్య గ్రహణం కన్యా రాశి వారికి కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాశి వ్యక్తుల కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో విభేదాలు ఉండవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం.

తులా రాశి:
ఈ ఏడాదిలో ఏర్పడే రెండవ సూర్య గ్రహణం యొక్క చెడు ప్రభావం తులా రాశి వారిపై కూడా ఉంటుంది. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు.  చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓపికతో పని చేయండి.

Also Read: MS Dhoni Fans: ఎంఎస్ ధోనీని చూడటం కోసమే ఈ జాబ్‌ చేస్తున్నా!

Also Read: CSK vs GT IPL 2023 Final: గుజరాత్‌కు ఐపీఎల్ టైటిల్ కష్టమే.. చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

Trending News