Saturn transit effect: శనిగ్రహ సంచారం... త్వరలో మారనున్న ఈ 3 రాశుల అదృష్టం..!

Shani transit effect 2022: శని గ్రహం వచ్చే ఏడాది ప్రారంభంలో కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభరాశిలో శని సంచారం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2022, 09:34 AM IST
Saturn transit effect: శనిగ్రహ సంచారం... త్వరలో మారనున్న ఈ 3 రాశుల అదృష్టం..!

Saturn transit effect 2022: శని గ్రహం ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరి 17, 2023న శని మకరరాశిని విడిచిపెట్టి కుంభరాశిలోకి (Saturn transit in Aquarius 2023) ప్రవేశిస్తుంది. శనిరాశిని మార్చిన వెంటనే కొన్ని రాశులపై శని మహాదశ మెుదలవుతుంది, కొన్నిరాశులపై తొలగిపోతుంది. ఈ నెలలో కొన్ని రాశులకు సడేసతి, ధైయా నుండి ఉపశమనం కలిగింది. రాబోయే శని సంచారం మరో 3 రాశులవారికి ఊరటనివ్వనుంది. 

జూలై 12న శని మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మిథునం, తులరాశి, ధనుస్సు రాశుల వారికి శని సడేసతి, ధైయా గురయ్యారు. అయితే ఈ వ్యక్తులు ఏప్రిల్ 29న సడే సతి మరియు ధైయా నుండి ఉపశమనం పొందారు. అయితే కొంతకాలం తర్వాత ఈ రాశుల వారికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. జనవరి 17, 2023న శని కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఈ మూడు రాశుల వారికి సడే సతి, ధైయా తొలగిపోతాయి. 

ఈ రాశులవారికి ప్రయోజనాలు
2023లో శని కుంభరాశిలో ప్రవేశించిన వెంటనే మిథున, తుల, ధనుస్సు రాశుల వారికి శని మహాదశ తొలగిపోతుంది. ఇది వారి జీవితంలో అనేక విధాలుగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ మూడు రాశుల వారు ఆర్థికంగా మెరుగు పడతారు. ఆదాయం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. పనిలో విజయం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.

ఈ రాశుల వారికి కష్టాలు
వచ్చే ఏడాది ప్రారంభంలో కుంభరాశిలో శని సంచారం వల్ల కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి కష్టాలు మెుదలవుతాయి. వీరిపై శనిమహాదశ మెుదలవుతుంది. మీన రాశి వ్యక్తులపై సడే సతి ప్రారంభమవుతుంది. మరోవైపు కర్కాటక రాశి, వృశ్చిక రాశుల వారు ధైయాకు గురవుతారు. దీంతో వారి జీవితంలో సమస్యలు పెరుగుతాయి.

Also Read: Mars Transit Effect 2022: వృషభరాశిలో కుజుడు సంచారం... ఈ 5 రాశులవారికి బంపర్ ప్రయోజనాలు! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News