Shani Margi 2023: త్వరలో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. ఇందులో రాశి ఉందా?

Saturn transit 2023: న్యాయదేవుడైన శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉంటాడు. శనిదేవుడి గమనంలో మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 08:39 PM IST
Shani Margi 2023: త్వరలో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. ఇందులో రాశి ఉందా?

Shani Margi 2023 effect: అష్టగ్రహాల్లో శనిదేవుడు ఒకటి. పురాణాల ప్రకారం, శనిదేవుడు సూర్యదేవుడు కుమారుడు. ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నాడు. నవంబరు 04 నుంచి నేరుగా నడవనున్నాడు. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. సాధారణంగా శనిదేవుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

మిథునరాశి
కుంభరాశిలో శని ప్రవేశం మిథునరాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి.. గుడ్ టైమ్ స్టార్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ఏదైనా భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
వృషభరాశి
శని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 
సింహరాశి
శని గమనంలో మార్పు సింహరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మీరు ప్రతి పనిలో సక్సెస్ అవుతారు. 

Also Read: Navratri Day 1 2023: శారదీయ నవరాత్రుల్లో ఈ రోజే మొదటి రోజు..శైలపుత్రి అమ్మవారిని పూజిస్తే చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News