Saturn Transit 2023: శని గ్రహం స్థితిలో మార్పు ప్రభావంతో రాత్రికి రాత్రి కుబేరులవడం ఖాయం, ఎప్పట్నించంటే

Saturn Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గోచారం చేస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈసారి ఆ ప్రభావం శని గ్రహానికి సంబంధించి ఇతర రాశులతో ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 26, 2023, 06:14 AM IST
Saturn Transit 2023: శని గ్రహం స్థితిలో మార్పు ప్రభావంతో రాత్రికి రాత్రి కుబేరులవడం ఖాయం, ఎప్పట్నించంటే

Saturn Transit 2023: చాలామంది శని గ్రహం అంటే చాలు వణికిపోతుంటారు. శని అంటేనే దారిద్య్రానికి ప్రతీకగా భావిస్తుంటారు. కానీ శని గ్రహం కొన్ని సందర్భాల్లో  కొంతమందిని రాత్రికి రాత్రి ధనవంతుల్ని చేసేస్తుంటుంది. శని దయ కూడా ఆ స్థాయిలో ఉంటుందంటారు. పూర్తి వివరాలు మీ కోసం..

హిందూ విశ్వాసాల ప్రకారం ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని గ్రహం స్థితి నవంబర్ 4వ తేదీన మారనుంది. దీనివల్ల మొత్తం 12 రాశులపై స్పష్టంగా కన్పించినా కొన్ని రాశుల జీవితంలో కీలక మార్పులు తీసుకురానుంది. 2025 వరకూ శని గ్రహం ఇదే రాశిలో అంటే కుంభ రాశిలోనే ఉంటాడు. నవంబర్ 4వ తేదీన ఇదే రాశిలో స్థితి మార్చుకోనుంది. దీనివల్ల కొన్ని రాశుల జీవితాలు సమూలంగా మారనున్నాయి. పూర్తిగా సానుకూలంగా పరిస్థితి ఉండనుంది. శని గ్రహం కటాక్షం ఈ రాశి జాతకులపై స్పష్టంగా ఉండనుంది. 

హిందూ జ్యోతిష్యం ప్రకారం శని సక్రమ మార్గం ప్రభావం అన్ని రాశులపై..ఆయా రాశుల దైనందిన జీవితాలపై పడుతుంది. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని గ్రహం స్థితిలో నవంబర్ 4న మార్పు రానుంది. ఆ రోజు శనివారం. అదే రోజు శని గ్రహం స్థితి మారనుంది. ఫలితంగా కొన్ని రాశులపై శని గ్రహం కటాక్షం ఎంత పెద్దఎత్తున ఉంటుందంటే..రాత్రికి రాత్రి ఈ రాశులవారిని శని గ్రహం ధనవంతులు చేసేస్తుంది. శని దారిద్య్రం పట్టితే ఎంత ప్రతికూలంగా ఉంటుందో, దయ కురిస్తే కూడా అంతే అద్భుతంగా పాతాళం నుంచి ఆకాశానికి ఎదిగినట్టుగా ఉంటుంది. 

కర్కాటక రాశి జాతకులపై శని గ్రహం స్థితి మార్పు ప్రభావం అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఈ సమయంలో కష్టపడినదానికి పూర్తిగా ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఈ సమయంలో ఏ విషయంలోనైనా మిత్రులు, బంధువుల పూర్తి సహకారం లభిస్తుంది. మానసిక శాంతి, ఆనందం కూడా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు

జ్యోతిష్యం ప్రకారం కన్యా రాశి జాతకులకు శని గ్రహం స్థితిలో రానున్న మార్పు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యేలా చేస్తుంది. ఈ రాశి జాతకుల ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఊహించనివిధంగా డబ్బులు వచ్చిపడతాయి. కొత్త ఉద్యోగాలకై వెతికేవారికి లాభం కలుగుతుంది. జీవితంలో సానుకూల పరిణామాలు ఎక్కువగా కన్పిస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. 

హిందూ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శని కుంభ రాశిలో స్థితి మార్చుకోవడం వల్ల ఆ ప్రబావం మొత్తం అన్ని రాశులపై తప్పకుండా పడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. అంతేకాకుండా వ్యాపారం విస్తృతమౌతుంది. ఈ సమయంలో ఆర్ధిక పరిస్థితి ఊహించనివిధంగా మెరుగుపడుతుంది. శని గ్రహం సక్రమమార్గం కారణంగా ఈ రాశి వారి ఆస్థులు అద్బుతంగా పెరిగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఆర్ధికంగా ఉన్నత స్థితిని పొందుతారు. 

Also read: September 2023 Lucky Zodiac Sign: ఈ రాశులవారికి సెప్టెంబర్ నెల మొత్తం లాభదాయకం..ఆడిందే ఆట!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News