Shani Dev Gochar in Kumbh 2024: శనిదేవుడు అంటే అందరిలోనూ ఏదో తెలియని భయం. ఎందుకంటే శని ఎప్పుడు అశుభ ఫలితాలనే ఇస్తాడు వారి నమ్మకం. అయితే శని గ్రహం అప్పుడప్పుడు శుభఫలితాలను కూడా ఇస్తుంది. ఈ దేవుడి దయ ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ గా మారతాడు. అదే శని ఆగ్రహం ధనవంతుడిని కూడా దరిద్రుడిగా మార్చగలదు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో ఉన్నాడు. వచ్చే ఏడాది కూడా అదే స్థానంలో ఉంటాడు. శని యెుక్క ఈ మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు గురించి తెలుసుకుందాం.
మేష రాశి
నూతన సంవత్సరం మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. వీరు చేపట్టిన అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభిస్తాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. అయితే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త జాగ్రత్త వహించండి. శనిదేవుడు అనుగ్రహంతో మీరు ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.
సింహరాశి
శని కదలిక సింహరాశి వారికి కలిసి వస్తుంది. కొత్త ఏడాదిలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు బాధల నుండి బయటపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. దాంపత్య జీవితంలో గొడవలు ఉంటాయి, కానీ సద్దుమణుగుతాయి. వ్యాపారులు లాభపడతారు.
తుల రాశి
కొత్త సంవత్సరం తులరాశి వారికి ఎన్నో రెట్లు ప్రయోజనాలను ఇవ్వబోతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు చదువుపై దృష్టి పెడతారు. జాబ్ కోసం ప్రయత్నించే వారి కల నెరవేరుతుంది. మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
Also Read: Shukra Gochar 2023: డిసెంబర్ 25న కీలక పరిణామం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook