Raksha Panchami 2022: రక్షా బంధన్ రోజున సోదరులకు రాఖీ కట్టలేకపోతే.. ఈ రోజు కట్టొచ్చు ఇది మీకు తెలుసా.?

Raksha Panchami 2022: హిందూ సాంప్రదాయం ప్రకారం.. భాద్రపద కృష్ణ పక్షం 5 వ రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. అయితే ఈ పండగ రోజునా  రక్షా పంచమి కూడా రావడం విశేషం.. రక్షా పంచమి పలు ప్రాంతాల్లో రక్షా పంచమి జరుపుకుంటారు. దీనిని శాంతి పంచమిని అని కూడా అంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2022, 12:09 PM IST
  • రాఖీ పండగ రోజున సోదరులకు రాఖీ కట్టలేకపోతే..
  • ఈ రోజు కట్టొచ్చని శాస్త్రం సూచిస్తోంది
  • రక్షా పంచమి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..?
Raksha Panchami 2022: రక్షా బంధన్ రోజున సోదరులకు రాఖీ కట్టలేకపోతే.. ఈ రోజు కట్టొచ్చు ఇది మీకు తెలుసా.?

Raksha Panchami 2022: హిందూ సాంప్రదాయం ప్రకారం.. భాద్రపద కృష్ణ పక్షం 5 వ రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. అయితే ఈ పండగ రోజునా  రక్షా పంచమి కూడా రావడం విశేషం.. రక్షా పంచమి పలు ప్రాంతాల్లో రక్షా పంచమి జరుపుకుంటారు. దీనిని శాంతి పంచమిని అని కూడా అంటారు. ఈ పండగను ప్రధానంగా ఒరిస్సాలో మాత్రమే జరుపుకుంటారు. అయితే దీని ప్రత్యేక కొన్ని కారణాల వల్ల సోదరులకు రాఖీ కట్టలేకపోతే.. రోజు వారికి రాఖీ కట్టొచ్చని శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే శాస్త్రం వేనుక దాగి ఉన్న పలు ఈ రోజూ విశేషాలను మనం తెలుసుకుందాం..

రక్షా పంచమి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..?:

రక్షా పంచమి పండుగను ప్రధానంగా ఒరిస్సాలో జరుపుకుంటారు. కానీ ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాలలో ఈ పండగను జరుపుకోడం విశేషం. ఈ రోజు మహాశివున్ని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని శాస్త్రం తెలుపుతోంది. రక్షా బంధన్ రోజున సోదరుడికి రాఖీ కట్టలేకపోతే.. ఈ రోజూ కడితే మంచిదని శాస్త్రం తెలుపుతోంది.

రక్షా పంచమి పూజా విధానం:
ఒరిస్సాలో జరుపుకునే రక్షా పంచమి ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు శివున్ని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, అనుకున్న కోరికలు నెరవేరుతాయని హిందువులు నమ్ముతారు. రాఖీ కట్టిన తర్వాత నాగదేవతకు పాలు నైవేద్యంగా సమర్పిస్తే.. దంపతులు సంతానం కలుగుతుందని నమ్మకం.

రక్షా పంచమికి పరిహారాలు:
రక్షా పంచమి రోజున నాగదేవతను పూజిస్తారు. దీని తర్వాత ఇంటికి దక్షిణ దిశలో రాత్రి నైవేద్యంగా పెట్టాలి. అంతేకాకుండా ఎడమ చేతిలో నల్ల ఉప్పును పసుపు గుడ్డలో కట్టాలి. ఇలా కట్టిన గుడ్డను ఇంటికి నైరుతివైపున వదిలేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం పేర్కొంది.

Also Read:  Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం

Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News