Raksha Bandhan Muhurat 2023: ప్రతి సంవత్సరం రాఖీ పండగను శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం పౌర్ణమి తిథి రెండు రోజులు కావడంతో భద్ర కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం చాలా మంది భద్ర కాలంలో కూడా రాఖీలు కడుతున్నారు. ఇలా ఏ సమయాల్లో పడితే ఆ సమయాల్లో కట్టడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా భద్ర కాలంలో కట్టడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం పండగ రెండు రోజు కావడం వల్ల ఏయే సమయాల్లో సోదరులకు రాఖీలకు కట్టడం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం:
తెలుగు క్యాలెండర్ ప్రకారం..ఆగస్టు 30న భద్ర 10.05 గంటలకు ప్రారంభమై రాత్రి 08.58 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో రాఖీలు కట్టడం అశుభమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే రాఖీలు ఇదే రోజు కట్టాలనుకునేవారు రాత్రి పూట భద్ర సమయం ముగిసిన గంట తర్వాత కట్టడం మేలని కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పండగను మరుసటి రోజు ఉదయం 07.37 గంటల నుంచి జరుపుకోవడం మేలని మరికొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
రాఖీ రోజున భద్ర ఎప్పుడు ముగుస్తుంది?:
రాఖీ భద్ర కాలం ముగింపు సమయం రాత్రి 09:01
రాఖీ భద్ర కాలం రాక సమయం రాత్రి 05:30 నుంచి 06:31 వరకు
రాఖీ భద్ర కాలం ఉండే సమయం రాత్రి 06:31 నుంచి 08:11 వరకు
రాఖీ రోజే పంచ మహాయోగం:
ఆగస్టు 30న సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా పంచ మహాయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహాల స్థానం వల్ల బుధాదిత్య, వాసరపతి, గజకేసరి, షష యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దాదాపు 700 ఏళ్ల తర్వాత రాఖీ పండగ రోజున గ్రహాల్లో మార్పులు జరగబోతున్నాయి.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి