Rahu Ketu Gochar 2023: త్వరలో రాహు-కేతువుల సంచారం... ఈరాశుల జీవితం నరకప్రాయం.. ఇందులో మీరున్నారా?

Rahu Ketu Gochar 2023: నీడ గ్రహాలైన రాహు మరియు కేతువులు త్వరలో తమరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించనున్నాయి. ఇది కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 06:38 PM IST
Rahu Ketu Gochar 2023: త్వరలో రాహు-కేతువుల సంచారం... ఈరాశుల జీవితం నరకప్రాయం.. ఇందులో మీరున్నారా?

2023 Rahu Ketu Gochar Effect: ఆస్ట్రాలజీలో రాహు, కేతు గ్రహాలను ఛాయా గ్రహాలు లేదా దుష్ట గ్రహాలు అంటారు. సాధారణంగా ఈ రెండు గ్రహాలు ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈరెండు గ్రహాలు ఎప్పుడూ రివర్స్ లో కదులుతూ ఉంటాయి. ఇవి రెండూ ఏడాదిన్నరకు ఒకసారి తమ రాశులను మారుస్తాయి. ఈ రెండు పాప గ్రహాలు ఈ సంవత్సరం 30 అక్టోబర్ 2023న మీనరాశిలోకి ప్రవేశించాడు. దీని వల్ల నాలుగు రాశులవారు కష్టాలను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

రాహు-కేతు గోచారం ఈ రాశులకు కష్టకాలం
మేషరాశి
రాహు-కేతువుల సంచార సమయంలో మేష రాశి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా వీరిని అనేక రకాల సమస్యలు చుట్టిముడతాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తుతాయి. 
కన్య రాశి
రాహు-కేతు గోచారం ఈరాశి వారిని ఇబ్బంది పెడుతుంది. వీరు ప్రతి రంగంలోనూ నష్టాలను చవిచూస్తారు. వ్యాపారులు, ఉద్యోగులుక ఈ సమయం అంతగా కలిసిరాదు. మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీకు ప్రియమైన వారితో విభేదాలు వస్తాయి. 
వృషభం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహు-కేతువుల సంచారం వృషభ రాశి వారికి బాధాకరంగా ఉంటుంది. మీరు అడుగడుగునా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. డబ్బును దుబారా చేస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. 
మీనరాశి
మీన రాశి వారికి కూడా ఈ సమయం సమస్యలతో నిండి ఉంటుంది. వీరు ఏ పనిచేపట్టినా దానిని పూర్తి చేయడంలో కష్టాలు పడతారు. వ్యాపారులకు ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. అప్పులు వాళ్లు మిమ్మల్ని వేధిస్తారు.

Also Read: Shani Dev: మార్చి 5 నుంచి ఈరాశులకు శనిదేవుడు కష్టాలను పెంచనున్నాడు... ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News