Pournami 2024 Date And Time: పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఇవే..ఇలా చేస్తే సంపాదనకు డోకా ఉండదు!

Pournami 2024 Date And Time: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జనవరి 25వ తేదీన రాబోతున్న పుష్య పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించి దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా సంపాదన కూడా పెరుగుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 07:33 AM IST
Pournami 2024 Date And Time: పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఇవే..ఇలా చేస్తే సంపాదనకు డోకా ఉండదు!

Pournami 2024 Date And Time: 2024 సంవత్సరంలో మొదటి పౌర్ణిమ జనవరి 25న పుష్యమాసం శుక్లవక్షం రోజున రాబోతోంది. ఈరోజు నదీ స్నానాలు ఆచరించి సూర్య భగవానుడిని పూజించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. అయితే ఈ సంవత్సరం రాబోతున్న పుష్య పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జనవరి 24వ తేదీన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ మొదటి పౌర్ణమికి ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ సమయంలో కొన్ని రాష్ట్రాల ప్రజలు విష్ణుమూర్తి తో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. పుష్య పౌర్ణమి రోజు ప్రత్యేక సమయాల్లో విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించి ఆర్థికంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా ఈరోజు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన కొన్ని ప్రత్యేక నియమాలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆ పూజా నియమాలయంతో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఇలా చేయండి:
పుష్య పౌర్ణమి రోజున పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఉదయాన్నే శుభ సమయంలో నిద్ర లేచి నదీ స్నానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పసుపు రంగులో ఉన్న పట్టు వస్త్రాలను ధరించి పూర్వీకులకు నైవేద్యాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభించి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

పుష్య పౌర్ణమి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే:
పురాణాల ప్రకారం పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే లక్ష్మీదేవిని పూజించే క్రమంలో తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా పూజలో భాగంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి..కనకధార స్తోత్రం, శ్రీ సూక్త, విష్ణుసహస్త్రాణం పారాయణం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంటి దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరగడమే కాకుండా సంపాదన కూడా పెరుగుతుంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News