Planet Shanti Remedy: శని గ్రహ కోపానికి గురికాకుండా ఉండాలంటే.. ఈ పొరపాట్లు చేయొద్దు!

Jupiter, Venus and Saturn Shanti Remedy. గురు, శుక్ర, శని గ్రహాల అశుభ ప్రభావాలను నివారించడానికి ఎలాంటి తప్పులు చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 8, 2022, 01:10 PM IST
  • శని గ్రహం కోపానికి గురికాకుండా ఉండాలంటే
  • అనుకోకుండా కూడా ఈ పొరపాట్లు చేయొద్దు
  • స్త్రీలను అస్సలు అవమానించవద్దు
Planet Shanti Remedy: శని గ్రహ కోపానికి గురికాకుండా ఉండాలంటే.. ఈ పొరపాట్లు చేయొద్దు!

Jupiter, Venus and Saturn Shanti Remedy: జ్యోతిషశాస్త్రంలో శని, శుక్ర మరియు గురు గ్రహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఓ వ్యక్తి జాతకంలో శని, శుక్ర, గురు గ్రహాలు సరిగా లేకుంటే (అశుభ స్థానం).. ఆ వ్యక్తికి ఏదీ కలిసి రాదు. కస్టపడి పనిచేసినా ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే ఓ వ్యక్తి  జాతకంలో ఈ మూడు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే.. వారు శాంతి కోసం కొన్ని నివారణలు చేయాల్సి ఉంటుంది. అయితే గురు, శుక్ర, శని గ్రహాల అశుభ ప్రభావాలను నివారించడానికి ఎలాంటి తప్పులు చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం.

శని నివారణ కోసం:
శని యొక్క చెడు దృష్టిని నివారించాలనుకుంటే.. ఈ తప్పులు అనుకోకుండా కూడా చేయకూడదు. లేదంటే జీవితంలో ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. శని నివారణ కోసం ఎవరికీ అబద్ధం చెప్పొద్దు, మోసం చేయ్యెద్దు. తప్పుడు మార్గంలో ఎవరి సొమ్మును లాక్కోవద్దు. కష్టపడే ప్రజల శ్రమను దోపిడీ చేయవద్దు. అలానే వికలాంగులను వేధించడం కానీ ఎగతాళి కానీ చేయవద్దు.

గురు నివారణ కోసం:
మీరు బృహస్పతి గ్రహం అశుభ ఫలితాలను నివారించాలనుకుంటే.. జ్ఞానులను, గురువులను, సాధువులను అస్సలు అవమానించవద్దు. జ్ఞానానికి మరియు విద్యకు గురువు కారకుడు కాబట్టి ఒకరి విద్యకు ఆటంకం కూడా కలిగిచొద్దు. అలాగే మీ చుట్టుపక్కల వారిని ఎవరినీ విమర్శించవద్దు.

శుక్ర నివారణ కోసం:
శుక్ర గ్రహ అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, ప్రేమ, ఆనందం లభిస్తాయి. శుక్రుడు సరైన స్థానంలో లేకుంటే మాత్రం ఆ వ్యక్తి జీవితం మొత్తం పేదరికంతో గడపాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం కూడా అంతగా బాగుండదు. ఇవి మీ దరిచేరకుండా ఉండాలంటే..  ప్రేమలో ఎవరినీ మోసం చేయవద్దు. స్త్రీలను అస్సలు అవమానించవద్దు. డబ్బు విషయంలో ఎవరినీ బాధపెట్టవద్దు. పొరపాటున కూడా డబ్బు గురించి గొప్పగా చెప్పుకోవద్దు.

Also Read: Rohit Sharma Captain: ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్‌ శర్మ.. ఏ కెప్టెన్‌కూ లేని ట్రాక్ రికార్డ్!  

Also Read: ఆషాఢ పూర్ణిమ రోజున స్నానం, దానం చేయండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News