Oppo A3 Pro 5G Price: అమెజాన్‌లో రూ. 999కే Oppo A3 Pro 5G మొబైల్‌.. నమ్మట్లేదా? ఇప్పుడే చెక్‌ చేసుకోండి..

OPPO A3 Pro 5G Price: ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన OPPO A3 Pro 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో అతి తక్కువ ధరలు లభిస్తోంది. లిమిటెడ్ టైం డీల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి డిస్కౌంట్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 1, 2024, 01:59 PM IST
Oppo A3 Pro 5G Price: అమెజాన్‌లో రూ. 999కే Oppo A3 Pro 5G మొబైల్‌.. నమ్మట్లేదా? ఇప్పుడే చెక్‌ చేసుకోండి..

 

OPPO A3 Pro 5G Price: 15వేల లోపే 8జీబీ ర్యామ్ కలిగిన మంచి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సువర్ణవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా చైనా బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌ను కొనుగోలు చేసే వారికి 10 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే లాంచ్ అయిన ఒప్పోకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ మరింత డెడ్ చీప్ ధరల్లో వస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ లిమిటెడ్ టైం డీల్‌లో భాగంగా ఒప్పోకు సంబంధించిన ఏ మొబైల్స్ అతి తక్కువ ధరకే లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

అమెజాన్లో లిమిటెడ్ టైం డీల్‌లో భాగంగా OPPO A3 Pro 5G స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెజాన్ ఈ దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ 128, 256జిబి రెండు ఇంటర్నల్ స్టోరేజ్‌లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ పై లిమిటెడ్ టైం డీల్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ MRP ధర రూ.20,999 కాగా ఈ ఆఫర్స్‌లో భాగంగా అమెజాన్‌లో 14 శాతం తగ్గింపుతో రూ.17,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లో చూస్తే, ఈ OPPO A3 Pro 5G స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా  HDFC బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఈ మొబైల్ పై అదనంగా మరెన్నో బ్యాంకులకు సంబంధించిన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్ని బ్యాంకులకు క్రెడిట్ కార్డులను వినియోగించి EMI ఆప్షన్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే వారికి నో కాస్ట్‌ను కూడా అందిస్తోంది. 

అమెజాన్ ఈ OPPO A3 Pro 5G మొబైల్‌పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్‌ని కూడా అందిస్తోంది. ఈ ఆహారం వినియోగించుకుంటే భారీ డిస్కౌంట్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను పొందవచ్చు. ముందుగా ఈ ఆఫర్ను వినియోగించడానికి పాత మొబైల్‌ను అమెజాన్‌కి ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ మొబైల్ తప్పకుండా మంచి కండిషన్ స్క్రాచెస్ లేకుండా ఉంటేనే ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. మంచి కండిషన్ కలిగిన పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసే వారికి దాదాపు రూ.17,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 999కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News