Numerology: ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు సక్సెస్, లగ్జరీ వెంటపడి వస్తుంది..

About Numbers 6 And 15, 24 In Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులకు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా వీరు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. అలాగే జీవితంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా సక్సెస్ అవుతారు. అయితే ఏ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు మంచి జరుగుతుందా ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 17, 2024, 10:16 AM IST
Numerology: ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు సక్సెస్, లగ్జరీ వెంటపడి వస్తుంది..

About Numbers 6 And 15, 24 In Numerology: జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో సంఖ్యా శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంఖ్యా శాస్త్రంలో ఒక్కొక్క మూలంకానికి ఒక్కొక్క సొంత ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంఖ్య ఏదో ఒక గ్రహంతో పాటు దేవతలకు సంబంధం కలిగి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ శాస్త్రం ప్రకారం పుట్టిన వ్యక్తి తేదీని గణాంకం చేయడం వల్ల అతడు లేదా ఆమె భవిష్యత్తును పూర్తిగా అంచనా వేయవచ్చు. అలాగే ఈ సంఖ్యా శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన సంఖ్య తేదీల్లో పుట్టిన పుట్టిన వారిని అదృష్ట వ్యక్తులుగా గుర్తిస్తారు. జ్యోతిషా శాస్త్రంలో తెలిపిన మూల్యంకాల ప్రకారం శుక్రుడిని ఆరవ సంఖ్యగా పరిగణిస్తారు. అందుకే 6వ తేదీలో జన్మించిన వ్యక్తులను అదృష్టవంతులుగా చెప్పుకుంటారు. వీరికి జీవితంలో సంపదకు శ్రేయస్సుకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే ఎలాంటి సమస్యలు వచ్చిన సులభంగా బయటపడతారు. ఇవే కాకుండా సంఖ్యాశాస్త్రం ప్రకారం మరిన్ని అంకెలు కూడా ఉన్నాయి. ఈ అంకెల్లో జీవించిన వ్యక్తులకు జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. 

సంఖ్యాశాస్త్రం ప్రకారం సంవత్సరంలోని ఏ నెలలోనైనా 6,15, 24 తేదీల్లో పుట్టిన వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అంతేకాకుండా వీరిని శుక్ర గ్రహానికి సంబంధించిన వారిగా కూడా పిలుస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు లగ్జరీ లైఫ్, ఆనందం, సంపాదన చాలా తేలికగా పొందుతారు. ముఖ్యంగా 6వ తేదీలో జన్మించిన వ్యక్తుల కైతే ఎల్లప్పుడూ శుక్రుడు అనుగ్రహం లభించి విపరీతమైన డబ్బును సంపాదించుతారు. అంతేకాకుండా ఎలాంటి పెట్టుబడులు పెట్టిన వీరు విపరీతమైన ధన లాభాలను పొందగలుగుతారు.

అలాగే వీరికి ఆర్థిక స్తోమత కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి లోటు ఉండదు. ఆరవ తేదీల్లో జన్మించిన వ్యక్తులకు నేరుగా లక్ష్మీ అనుగ్రహం లభించి జీవితంలో ఐశ్వర్యాన్ని పొందుతారు. అంతేకాకుండా ఊహించని ధన లాభాలను కూడా పొందగలిగే శక్తిని కలిగి ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశి వారికి మొట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగే ఈ అంకెలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి పనులు చేసిన విపరీతంగా ధన లాభాలు పొందగలుగుతారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

పైన మూడు అంకెల్లో జీవించిన వ్యక్తులు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. దీని కారణంగా వీరు జీవితంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా డబ్బులు సంపాదించగలుగుతారు. అలాగే జీవితంలో సంపాదన ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా వీరికి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభించి అనుకున్న పనులు ఎంతో తొందరగా నెరవేరుతాయి. దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో వస్తున్న ప్రతి సమస్య వెంట వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాల్లో కూడా తొందరగా మార్పులు వస్తాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News